Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెరు గుదలను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు ఈనెల 12వ తేదీన మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్ నియోజకవర్గంలో చేప ట్టనున్న ధర్నాలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొ నాలని కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కీసర సమీపంలోని జిల్లా ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ నేతలతో కలిసి సమావేశం నిర్వాహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగ డం వల్ల సామాన్య ప్రజలపై భారం ఎక్కువ అవుతుంద న్నారు. గతంలో తమ ప్రభుత్వం హయాంలో ప్రజలపై భారం మోపలేదని గుర్తు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసేందు కు ప్రజల ప్రక్షాన పోరాటాలు చేస్తామని తెలిపారు. పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుంద న్నారు. పార్టీలో ఉన్న అందర్నీ కలుపుకుని పార్టీ అభివృది ్దకి కృషి చేస్తామన్నారు. ఈనెల 16న చలో రాజ్‌భవన్ కార్యక్రమం చేపడుతున్నామని పేర్కోన్నారు. ఈ సమా వేశంలో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ఓబీసీ సెల్ వైస్ చైర్మెన్ తోటకూర వజ్రేష్ యాదవ్, జిల్లా పరిషత్ కాంగ్రెస్ ప్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్దన్‌రెడ్డి, ఉప్పల్ మాజీ చైర్మెన్ మేకాల శివారెడ్డి, టీపీసీసీ సెక్రెటరీ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎం.ప్రవీణ్ రెడ్డి, మొ రుగు ముత్యాలు, మంచాల ప్రవీణ్, జూపల్లి రవిందర్, కోలా కృష్ణయాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు తటాకం అభిలాష్, తదితరులు పాల్గన్నారు.