Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
ఏపీలోని కాకినాడ నగరంలోని జగన్నాథపురం ప్రాం తంలో క్రికెట్ ఆడుతున్న దళిత యువకులు, వారి తల్లిదం డ్రులను కత్తులతో దాడి చేసి, కిరాతకంగా చంపిన వైఎస ్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయా లని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్ చేశారు. శుక్రవారం హిమాయత్ నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ దాడి వెనుక కాకినాడ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్రెడ్డి హస్తం ఉందనీ, ఆయనపై ఏపీ డీజీపీ వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దాడి కి గురైన దళితులకు సరైన వైద్య చికిత్స అందించలేక పోవడం వల్ల ఇద్దరు దళితులు చనిపోయారనీ, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేయకు ండా ఆ జిల్లా పోలీసు యంత్రాం గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బాధితులకు అన్యాయం చేస్తు న్నారన్నారు. సీఎం జగన్ పాల నలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. పోలీసు యంత్రాంగం అంతా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారనీ, మెజార్టీ మాల కులస్తులపై దాడులు జరుగుతున్నాయనీ, ఈ దాడులపై మాల జాతి స్పందించాలనీ, ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు. ఈ హత్యాకాండపై సీఎం జగన్, హౌంశాఖ మంత్రి సుచరిత వెంటనే స్పందించి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.