Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
పట్టణ ప్రగతితో పట్టణ రూపురేఖలు మారు తాయని మున్సిపల్ చైర్మెన్‌్ మంగళపల్లి రామ చంద్రయ్య, కమిషనర్ గుండె బాబు అన్నారు. డివిజన్ కేంద్రంలో ఐదవ వార్డులో కొనసాగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాలను వారు పరిశీలించారు. ఐదవ వార్డు ఆర్డీఓ ఆఫీస్ రోడ్డుకు ఉన్న ముళ్ళ కంచెలను జేసీబీ సాయంతో తొలగించామన్నారు. ఐదో వార్డులో పట్టణ ప్రకృతి వనానికి కేటాయించిన స్థలాన్ని పరిశీ లించారు. కార్యక్రమాలన్నింటిని ఈ- పోర్టల్ లో నమోదు చేస్తున్నామన్నారు. పట్టణంలో రోడ్లకు ఇరు వైపులా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తున్నారని అన్నారు. అనంతరం 12 , 15 వార్డు లో డ్రైనేజీ సిస్టం ను పరిశీలించారు. వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు సునీత, కొలుపుల శంకర్, నాయకులు జై సింగ్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం కోసమే పల్లెనిద్ర
అధికారులు, ప్రజా ప్రతినిధులు పల్లెనిద్ర కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే అవకాశం ఉంటుందని జడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ అన్నారు. మండలం లోని కర్కాల గ్రామంలో గురువారం రాత్రి పల్లె నిద్ర చేసి గ్రామస్థులతో మాట్లాడి సమస్యలను తెలుసు కున్నారు. శుక్రవారం ఉదయం 5. 30 గంటలకు లేచి 8 వార్డులో ఉన్న ప్రజలు, నాయకులతో సందర్శించి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అడిగి అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనులు , కరెంటు సమస్యలు , వ్యవసాయ పనులు, మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే త్రాగునీరు , పెన్షన్ స్కీమ్ , రైతుభందు తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపిఓ గౌస్, సర్పంచ్ సేగ్యం సురేఖ సురేందర్, ఎంపీటీసీ వల్లపు గోపన్న మల్లయ్య, ఉపసర్పంచ్ పసులాది వెంకన్న, పంచాయతీ కార్యదర్శి ప్రభు పాల్గొన్నారు.
ప్రతి మొక్కను సంరక్షించాలి
చిన్నగూడూరు : నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీఆర్ఎస్ మండల నాయకులు మూల మురళీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గుండంరాజుపల్లి గ్రామంలో హరితహారం మొక్కలను నాటారు. సర్పంచ్ సలీమా గంగన్న, వార్డు సభ్యులు యాకన్న, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, కారోబార్ సత్య హరి, అంగన్వాడి టీచర్లు జ్యోతి, సుమలత పాల్గొన్నారు.
తొర్రూర్ : పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పెద్దవంగర ఎంపీపీ ఈదురు రాజేశ్వరి అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం ఆర్సి తండాలో పల్లెనిద్ర చేపట్టా మన్నారు. శుక్రవారం ఉదయం అధికారులతో కలిసి తండాలోని అన్నీ బజార్లో కలియతిరిగి తండా వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన తండాల్లో మంచినీటి వసతి, రోడ్లు నిర్మించిన ఘనత మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కే దక్కుతుందన్నారు. బావోజి తండా, ఆర్సీ తండాలకు నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి 40 లక్షలు మంజూరు చేయడంతో తండావాసులు హర్షం వ్యక్తం చేశారు. ఫ్రైడే డ్రై డే లో పాల్గొన్నారు. నర్సరీ, పల్లె ప్రకతి వనం మరియు స్మశాన వాటిక పనులను పరిశీలించి మొక్కలు నాటారు. మండల స్పెషల్ ఆఫీసర్ రావూరి రాజు, డీఎల్పీఓ యండి శరబొద్దీన్, ఎంపీఓ కే యాకయ్య, సర్పంచులు బానోత్ జమున గోపాల్, జాటోత్ చిలకమ్మా హేమని, జగ్గు నాయక్, ఉప సర్పంచ్ అమల, కార్యదర్శులు పరమేశ్వర్, మాధవి పాల్గొన్నారు.
పరిశుభ్రంగా ఉంచుకోవాలి : రాము
ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రంగా ఉంచు కోవాలని తొర్రూర్ మున్సిపల్ 1వ వార్డు కౌన్సిలర్ భూసాని రాము అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని వార్డులో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహిం చారు. ఇంటిలో ఉన్న నీటి డ్రమ్ములు,కుండలు, ప్రతి శుక్రవారం కడిగి ఆరబెట్టుకోవాలని,ఇంటి చుట్టు పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. డెంగ్యూ, మలేరియా వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. వార్డు స్పెషలాఫీసర్ ఎడ్ల శ్రావణి, ఆర్పి ధనలక్ష్మి,అంగన్వాడి టీచర్ తాళ్ల పెలి ప్రమీల, స్థానికులు నల్లపు రాజు, భూసాని శ్రీశైలం, బొబ్బిలి శీను, స్వర్గం శీను తదితరులు పాల్గొన్నారు.
మేఘ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయాలి
తొర్రూర్ టౌన్ : జిల్లాలోని అతిపద్ద పల్లె ప్రకతి వానాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య జడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ అన్నారు శుక్రవారం మండలంలోని జమస్తాన్ పురం గ్రామాన్ని సందర్శించి మాట్లాడారు. అంతర్గత సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో నిర్మించాలని సర్పంచ్ జూపూడి రవీందర్ రెడ్డి కోరారు. ఎంపీడీవో భారతి, ఎంపీఓ గౌస్ పంచాయతీ కార్యదర్శి కార్తీక్‌గౌడ పాల్గొన్నారు.
మెగా పల్లె ప్రకతి వనం పరిశీలన
నెల్లికుదురు : మండలం లోని రతి రామ్ తండా గ్రామంలో మెగా పల్లె ప్రకతి వనం పరిశీలిం చినట్లు జిల్లా ఉద్యానవనశాఖ (హార్టికల్చర్), సెరికల్చర్ (పట్టుపురుగుల ) శాఖ అధికారి సూర్య నారాయణ తెలిపారు. శుక్రవారం రత్తిరామ్ తండా గ్రామపంచా యతీ పరిధి మెగా పల్లె ప్రకతి వనాన్ని సందర్శించి మాట్లాడారు. అదనపు డీఆర్డీఓ పీడీ దయాకర్ రావు, మండల స్పెషల్ ఆఫీసర్ బాలరాజు, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, ఎంపీఓ బండారి పార్థసారథి. ఈసీ హారిక, ఏపీఓ హేమంత్‌కుమార్, టీఏ సందీప పంచాయతీ కార్యదర్శి నేహా పాల్గొన్నారు.
కొడకండ్ల : మండలంలోని నరసింగాపురం గ్రామంలోని ఐదో వార్డులో పాలకుర్తి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రమదానం నిర్వహించి చుట్టుపక్కల కంప చెట్లను తొలగించారు. గుంత లో మట్టి పోసి శ్రమదానం చేశారు. తన సొంత ఖర్చులతో శ్రమదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
పచ్చని చెట్లు భావితరాలకు మెట్లు
పచ్చని చెట్లు భావితరాలకు ఉపయోగపడతాయని ఇన్చార్జి ఎంపీడీవో దైవాధీనం అన్నారు. శుక్రవారం మండలంలోని రామవరంలో వాటిక పనులతోపాటు పల్లె ప్రకృతి వనం రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను పరిశీలించి పలు సూచనలిచ్చారు. సర్పంచ్ మందుల శిరీష, ఏపీవో కుమారస్వామి పాల్గొన్నారు.
దంతాలపల్లి : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని మండల వైద్యాధికారి సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంల ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని బీసీ కాలనీ లతోపాటు ,ఆస్పత్రి ఆవరణల ని పిచ్చి మొక్కలను చెత్తా చెదారాన్ని తొలగించారు. సీహెచ్‌వో బాలాజీనాయక్, హెల్త్ అసిస్టెంట్లు సత్యనారాయణ శ్రీనివాస్ చలపతి కళావతి, సుభద్ర పాల్గొన్నారు.
తాడ్వాయి : మండలం పరిధిలో మేడారం గ్రామ పంచాయతీ లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మేడారం ప్రత్యేక అధికారి, తహసీల్దార్ ముల్కనూరు శ్రీనివాస్ శుక్రవారం సందర్శించి పరిశీలించారు. మేడారం ఉత్తమ జపీపీగా ఎన్నికైన విషయం విధితమే. శుక్రవారం మేడారం సందర్శించి పల్లె ప్రకతి వనం, సెగ్రిగేషన్ షెడ్ తదితర పనులను పరిశీలించారు. అనంతరం వైకుంఠధామం లో మొక్కలు నాటారు. మండలంలోని మిగతా గ్రామ పంచాయతీలు కూడా మేడారం మాదిరిగా ముందుకు పయనించాలని సూచించారు. సర్పంచ్ చిడం బాబురావు, స్థానిక విఆర్వో బొప్ప సమ్మయ్య, పంచాయతీ కార్యదర్శి కొర్నేబెల్లి సతీష్ పాల్గొన్నారు.