Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయాలి
- డీఆర్డీఏ ప్రాజెక్టు మేనేజర్ మునిగాల దయాకర్
నవతెలంగాణ-వర్ధన్నపేట
ప్రతి గ్రామైక్య సంఘము 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక మహాసభలను నిర్వహించి, ఆదాయ వ్యయాలను సభ్యులందరికీ తెలియజేయాలని డీఆర్డీఏ ప్రాజెక్టు మేనేజర్ మునిగాల దయాకర్ తెలిపారు. శుక్రవారం స్థానిక బందావన మండల సమైక్య కార్యాలయంలో చెన్న సమ్మక్క అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. వివోలు తప్పిదాలకు తావులేకుండా, పారదర్శకంగా బాధ్యతలు నిర్వర్తించి గ్రామైక్య సంఘాలన్ని అత్యధిక లాభాలతో జిల్లాలో అగ్రస్థానంలో ఉంచేందుకు కృషి చేయాలన్నారు.
నిరుద్యోగులకు డీఆర్డీఏ ద్వారా ఉపాధిపై శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా, స్వయం ఉపాధి పథకాలపై వివిధ రకాల శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఉన్నతి కార్యక్రమంలో భాగంగా 100 రోజుల పని పూర్తి చేసుకున్న ప్రతి కుటుంబంలోని యువతీ, యువకులకు ఉచిత శిక్షణ, వసతి సౌకర్యంతో పాటు స్టయిఫండ్ ఇవ్వనున్నట్టు చెప్పారు. ప్రతి గ్రామంలో వ్యవసాయాధారిత కుటుంబాలతో రైతు ఉత్పత్తి దారుల సంఘాలను ఏర్పాటు చేయాలని నాన్ ఫామ్ ఇంచార్జి డీపీఎం సుధాకర్ తెలిపారు. వర్ధన్నపేట క్లస్టర్ లోని పర్వతగిరి, రాయపర్తి, వర్ధన్నపేట మండలాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా 43 టన్నుల మామిడి కాయలను సేకరించి 19లక్షల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జేడీఎం దివాకర్, ఏపీఎంలు వేణు, వేణుగోపాల్ రావు, సీసీలు గోలి కొమురయ్య, స్వామి, రమేష్, ఆడిటర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.