Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ- మట్టెవాడ
పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా వరంగల్ పట్టణ రూపు రేఖలు మారి అభివద్ధి చెందుతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు.29వ డివిజన్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, అదనపు కలెక్టర్ సంధ్యా రాణిలతో కలిసి ఆమె మొక్కలు నాటారు. అనంతరం మేయర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అంతరించి పోతున్న అడవులను కాపాడాలని మున్సిపల్ బడ్జెట్ లో 10 శాతం నిధులు హరితహారం కోసం కేటాయించి, పచ్చదనం పెంపునకు కషి చేస్తున్న నాయకులు సీఎం కేసిఆర్నన్నారు. పట్టణ ప్రగతిలో పట్టణాల్లో పచ్చదనం కూడా గణనీయంగా పెరిగిందని, పరిశుభ్రత పెరిగిందని, తద్వారా అంటు వ్యాధులు తగ్గాయన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు త్వరగా నెరవేర్చేలా పని చేయాలని కోరారు. ఇప్పటికే చేపట్టిన వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డులు, నర్సరీలు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి ద్వారా పట్టణాల్లో చాలా వరకు అంటువ్యాధులు రాకుండా నియంత్రించ గలిగామని తెలిపారు.. పేదల కోసం సీఎం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తూ తెలంగాణను అభివద్ధి పదంలో తీసుకెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆదనవు కమిషనర్ నాగేశ్వర్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈలు వెంకట రమణ, సత్యనారాయణ, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, బల్దియా, పబ్లిక్ హెల్త్, మెప్మా, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.