Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకుమట్ల
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన టేకుమట్లలో రూ.లు 22లక్షలతో నిర్మించిన రైతు వేదికను, అంకుషాపూర్, సోమనపల్లిలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు. అనంతరం సోమనపల్లి ఎస్సీ కాలనీలో సర్పంచ్ వుద్ధెమారి మహేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత గ్రామస్తులదేని తెలిపారు. ఇంటింటా తప్పనిసరిగా మొక్కలు నాటాలన్నారు. నూతనంగా ఏర్పడిన సోమనపల్లి పంచాయతీకి నిధులు తక్కువ వస్తున్నాయని సర్పంచ్ ఎమ్మెల్యేకు తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే గ్రామ అభివద్ధికి తన కోటా నుంచి నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు . రైతు వేదిక ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ శాఖ అధికారులు రైతు వేదికలలో అందుబాటులో ఉంటారన్నారు. రైతులు పంటలు వేసే ముందు సంబంధిత అధికారులను సంప్రదించి పంటలు వేయాలని, వారి సలహాలు సూచనలు తీసుకోవాలని రైతులకు సూచించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం రైతుబీమా, రైతుబంధు, రైతులకు సబ్సిడీపై విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జెడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి, వైస్ ఎంపీపీ ఐలయ్య, జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్, జిల్లా పంచాయతీ అధికారి ఆశ లత , డీఆర్డీఓ అధికారి పురుషోత్తం, ఎంపీడీఓ చండీరాణి, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి, టీిఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తి సంపత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బాధితులకు ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసి మాట్లాడారు. ప్రాణాపాయ స్థితిలోని పేదలకు సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందజేసి, వారిని ఆర్థికంగా ఆదుకుంటూ, వారి ఆరోగ్యం పట్ల సంపూర్ణ భరోసా కల్పిస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలంతా రుణపడి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వినోద వీరారెడ్డి, జెడ్పీటీసీ గొర్రె సాగర్, పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడి,్డ సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కామిడి రత్నాకర్ రెడి,్డ ఇన్చార్జి సర్పంచ్ పూర్ణచందర్రావు, ఎంపీటీసీ కట్కూరి పద్మ నరేందర్, కో-ఆప్షన్ మెంబర్ రాజ మహమ్మద్, వివిధ గ్రామాల సర్పంచులు పుట్టపాక మహేందర్, రాణి వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.