Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా
నవతెలంగాణ-భూపాలపల్లి
హరితహారంలో భాగంగా పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు గుర్తించిన రోడ్లకు ఇరువైపుల ఏవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటి సుందరంగా తీర్చి దిద్దాలని అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో హరితహారం, అవెన్యూ ప్లాంటేషన్, శానిటేషన్ పై ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, డీఆర్డీఏ, సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని, సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి పనుల పురోగతిని పరిశీలిస్తున్నారన్నారు. హరితహారంలో భాగంగా ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ అధికారులతో చర్చించి ఒక ప్రణాళిక రూపొందించి అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటి జిల్లాను సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. క్షేత్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ఏఈ లు వారి పరిధిలో ఉన్న స్మశాన వాటికలు, రైతు వేదికలు, క్లిమీటోరియమ్, పనులను వేగవంతం చేయాలన్నారు. ఎక్కడైతే పనులు పురోగతి కనిపించదో సంబంధిత శాఖల అధికారులు ఏఈ లను బాధ్యులను చేస్తూ వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్ బి ఏఈ లకు వారి పని విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు ఫోటోలు రూపంలో పనుల పురోగతిని అందించాలని ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటడానికి మ్యాప్ రూపొందించి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు పనుల ప్రగతి నివేదికలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్డీఏ పీడీ పురుషోత్తం, ఈఈ పీఆర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ బి. శ్రీనివాస్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ డీఈలు, ఏఇలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.