Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఓసీ జేఏసీ డివిజన్ అధ్యక్షులు ఎర్ర జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్డీవో పీ.పవన్‌కుమార్‌కు ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతు లేనిదే రాజ్యం లేదనీ, రాజకీయ పార్టీలు రైతులకు ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలయ్యా యన్నారు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉండగా రైతులను ఆదుకోకుండా నష్టం చేసే చట్టాలను తీసుకరావడం అన్యాయమన్నారు. పండించిన పంటకు మార్కెట్లో సరైన ధర లేక ప్రకతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోతుంటే రైతులకు భరోసానివ్వకుండా ఆగం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధానాన్ని వీడాలన్నారు. దేశవ్యాప్తంగా చేపడుతున్న రైతు ఉద్యమాలకు సంఘీభావం ప్రకటిస్తూన్నట్లు చెప్పారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించే చర్యలు చేపట్టాలన్నారు. 50 యేండ్లు నిండిన రైతుకు రూ.5వేలు పింఛన్ ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పథకం వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు కొనుగోలు కేంద్రాల ద్వారా అన్ని పంటలను కొనుగోలు చేయాలన్నారు. ఇందుకోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం వొత్తిడి తీసుకరావాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రకటించిన రెడ్డి, వైశ్య కార్పొరేషన్లు ప్రకటించాలని కోరారు. ఈ సందర్భంగా ఓసీ జేఏసీ ప్రతినిధులు బండారుపల్లి చెంచరావు, మేడవరపు కమలాకర్‌రావు, శింగిరికొండ మాధవ శంకర్ గుప్తా, తౌటిరెడ్డి కష్ణారెడ్డి, చకిలం కష్ణమూర్తి గుప్త, వేమిశెట్టి శ్రీనివాస్ గుప్తా, కోమండ్ల భూపాల్ రావు, వడ్డే చిరంజీవి పాల్గొన్నారు.