Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు వేల మంది పోలీసులతో భద్రత : మహంకాళి ఏసీపీ రమేశ్
నవతెలంగాణ-బేగంపేట్
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తామని మహంకాళి ఏసీపీ రమేష్ తెలిపారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో విలేకర్ల సమావేశం ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల జాతరకు మూడు వేల మంది పోలీసు బందో బస్తు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 6 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. బోనాల లైన్లను ఇందులోనే రెండు బోనాల లైన్లను ఏర్పాటు చేయనున్నట్టు, మొత్తం ఆరు క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలి పారు. ఆలయ ప్రాంగణం చుట్టూ 100 సీసీ కెమెరా లతో పాటు నేను సైతం కెమెరాలు కూడా ఎప్పటి కప్పుడు నిఘా నేత్రం ద్వారా భక్తుల క్యూలైన్లను చూ స్తామని తెలిపారు. ఎక్కడైనా ఇబ్బంది తలెత్తితే వెంట నే పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుంటారని తెలి పారు. మహంకాళి ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు మాట్లాడు తూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కు ధరించి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో డీఐ పురుషోత్తం, ఎస్సైలు గోపాల రావు, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.