Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
సమిష్టి కృషితోనే గ్రామం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుందని వైస్ సర్పంచ్ కొంతం వెంకట్ రెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలం కాచవాని సింగారం పంచాయతీ పాలకవర్గం సాధారణ సమావేశం సర్పంచ్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే ఉత్తమ గ్రామ పంచాయతీగా పలు అవార్డులు అందుకోవడం సంతోషించదగ్గ విషయ మన్నారు. ఐక్యతతో మరిన్ని అవార్డులు సొంతం చేసుకునే విధంగా పాలకవర్గం సహకరించాలని కోరా రు. అంతకు ముందు గ్రామంలో ప్రతి కాలనీకీ మిషన్ భగిరథ నీళ్ళు అందించడానికి, కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించే విధంగా చర్యలకు తీర్మాణిం చినట్టు ఆయన తెలిపారు. హరితహారం, భూగర్భ డ్రయి నేజీ, సీసీ రోడ్లపై పాలకవర్గం చర్చించినట్టు పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కర్రె జంగమ్మ, పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, వార్డు సభ్యులు మట్ట విష్ణుగౌడ్, రాయబండి నవీన్, పెరుమాండ్ల సుద ర్శన్, రాజగోని మహేష్ కుమార్, చెట్టుపల్లి గీత, కిన్నెర లక్ష్మీశ్రీ, మట్ట లలిత నల్ల రజిత, నల్ల అరుణ, ఓరుగంటి సరళ, అంబటి సంధ్య, కో-ఆప్షన్ సభ్యులు మోటకట్ల భద్రారెడ్డి, వర్కాల అంజనేయులు, బిల్ కలెక్టర్లు శ్రీని వాస్, సుదర్శన్‌రెడ్డి, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.