Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు ఎస్. ఆశాలత
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్/ధూల్‌పేట్
ఏడేండ్లుగా బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న తిరోగమన విధానాలపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కె.ఎన్.ఆశాలత అన్నారు. శుక్రవారం కిషన్‌గంజ్‌లోని కార్మిక సంఘం కార్యాలయంలో ఆ పార్టీ గోషామహల్ మహిళాశాఖ మూడో మహాసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెండావిష్కరణ చేశారు. ఈ మధ్య కాలంలో రైతాంగ ఉద్యమంలో అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సభలో మాట్లాడారు. రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా బీజేపీ తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 232 రోజులుగా రైతులు దేశ సరిహద్దుల్లో సుదీర్ఘ పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. బీజేపీ తన స్వార్థ రాజకీయ లబ్దికోసం మాత్రమే ప్రయత్నిస్తోందని, కరోనా విజృంభిస్తున్న సమయంలో తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని అన్నారు. అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాల్సిన టైమ్‌లో ఇవ్వకపోవడంవల్ల 4 లక్షల మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ప్రజల తరపు సీపీఐ(ఎం) ఏడాదికాలంగా పోరాడిందని, ఫలితంగా అందరికీ ఉచిత వ్యాక్సిన్ వేయడానికి ప్రభుత్వం అంగీకరించాల్సి వచ్చిందని అన్నారు. ఇది ప్రజా పోరాట విజయమన్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, వంటనూనె తదితర నిత్యావసర ధరలు విపరీతంగా పెంచుతుండటంతో బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరిగిందన్నారు. పెరిగిన ధరలను నియంత్రించాలని లేకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో దేశ వ్యాప్త ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మహాసభలో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి కార్యాచరణను రూపొందించారు. సమావేశ:లో డి.పుష్పలత, తోలిరాం రానీబారు, జీ. సంతోషి, ఎం. ఎల్లమ్మ, సీపీఐ(ఎం) గోషామహల్ జోన్ కన్వీనర్ పి.నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కార్యదర్శిగా టి రాణీబారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.