Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
దక్షిణ మధ్య రైల్వే మహిళా సంక్షేమ సంఘం (ఎస్సీఆర్ డబ్ల్యుడబ్ల్యుఓ) అధ్యక్షురాలు జయంతి మాల్య ఆధ్వర్యంలో శుక్రవారం చిలకలగూడాలోని విద్యా విహార్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులను ప్రశంసించారు.ఈసందర్భంగా పదో తరగతి పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, సర్టిఫికెట్స్, సావనీర్లు అందజేశారు. రైల్వే కుటుంబాలకు చెందిన విద్యార్థులతోపాటు సమాజంలోని ఇతర పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఎస్సీఆర్ డబ్ల్యుడబ్ల్యుఓ విశేష కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింతగా ఉన్నత స్థానాలకు చేరుకునే విధంగా ప్రోత్సాహించడానికి ఈ సన్మానం నిర్వహించిన్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ఆన్లైన్లో నిర్వహిస్తున్న తరగతులపై మరింత శ్రద్ధ పెట్టాలని, ఫిట్నెస్తో ఆరోగ్యవంతంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచడంలో తోడ్పడిన పాఠశాల సిబ్బంది అందరినీ ఆమె అభినందించారు. ఉన్నత కెరియర్‌కు పాఠశాల విద్య కీలకమైనదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అన్నారు. కార్యక్రమంలో సంక్షేమ సంఘం ట్రెజరర్ ఉషా జాయింట్ సెక్రటరీ అరుణా విశ్వనాథ్, కార్యనిర్వాహక సభ్యులుమాధవి విజరుకుమార్, అపర్ణ ఈశ్వర్ రావు, స్కూల్ హెచ్ఎం ఫణి కుమారి పాల్గొన్నారు.