Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షాలకు ఎప్పుడు ఏమవుతుందో తెలియని దుస్థితి
- పెచ్చులూడిన గదులు, ధ్వంసమైన కిటికీలు
- తాగునీటి కొరత, కంపుకొడుతున్న మరుగుదొడ్లు
- కాల్వలుగా వరండాలు, చెరువులుగా మైదానలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
వరుసగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని సర్కారు బడుల పరిస్థితి దారుణంగా తయారైం ది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరి స్థితి నెలకొంది. హైదరాబాద్ జిల్లాలో శిథిలావ స్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలలకుతోడు ఎక్కువ గా పాత భవనాల్లో కొనసాగుతుండటంతో చిన్న పాటి వర్షాలకే తడిసి ముద్దవుతున్నాయి. చాలా చోట్ల గోడల వెంబడి నీళ్లు చేరి పెచ్చులూడిపోతు న్నాయి. కిటికీలు నాణ్యమైగా లేకపోవడంతో నేరుగా వర్షపు నీరు పడి బెంచీలు పాడవుతున్నా యి. ఇక వరండాలు కాలువలను, మైదానాలు చెరువులను తలపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు జరుగుతుండగా.. 50శాతం టీచర్లు మాత్రమే స్కూళ్లకు హాజరవుతున్నారు. ప్రస్తుతం కురుస్తు న్న వర్షాలకు శిథిలావస్థకు చేరిన బడుల్లోకి నీరు చేరుతుండటంతో టీచర్లు వచ్చేందుకు భయపడు తున్నారు. తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పం దించి బడులను బాగు చేయాలని ఉపాధ్యా యులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు.
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 682 పాఠ శాలలు ఉన్నాయి. వీటిలో 182 ఉన్నత, 8 ప్రాథమికోన్నత, 492 ప్రాథమిక పాఠశాలలున్నా యి. ప్రస్తుతం అన్ని బడుల్లోనూ సరిపోను సదు పాయాలు లేకపోయినా ఉన్న వాటితో కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు. దాదాపు అన్ని పాఠశాలల్లో ఏదో ఓ కొరత ఉంది. మరుగుదొడ్లు, మూత్ర శాలలు, విద్యార్థుల సంఖ్య అనుగుణంగా లేకపో వడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇక బాలి కలు బాధలు వర్ణానాతీతం. ప్రహరీలు లేకపోవ డంతో పశువులు పాఠశాలల్లోకి ప్రవేశిస్తున్నాయి. భద్రత పరంగా రక్షణ లేదు. చీకటైతే అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. తాగు నీటి కొరత ఉంది. చాలా చోట్ల ఆర్వో ప్లాంట్స్ పని చేయడం లేదు. ఏటా విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి సౌకర్యాలు లేని పాఠ శాలల వివరాలను సేకరిస్తున్నారు. వాటి ఆధార ంగా బడుల్లో వసతులు, భవనాల మరమ్మతులు, కూల్చివేతలకు ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందే అభిప్రాయం వ్యక్తమ వుతోంది.
జీజీహెచ్ఎస్ (గోషామహల్) హైస్కూల్ బతుకమ్మకుంట రోడ్ అంబర్పేట్
ఈ బడి సొంత భవనంలో కొనసాగుతోంది. ఆవరణ, మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయి. నాలుగు యూనిట్లు మాత్రమే ఉన్నాయి. 220 మంది విద్యార్థులు, 13 మంది టీచర్లు, ఒక నాన్ టీచింగ్ స్టాప్ ఉన్నారు. తరగతి గదులు ఎని మిది ఉండగా.. మరో రెండు గదులు అవసర ముంది. లైబ్రరీ, ల్యాబ్, కంప్యూటర్, స్టాప్ రూమ్ వీటిల్లోనే అడ్జెస్ట్ చేస్తున్నారు. సరిపడా గదులు లేక అవరణలో పాఠాలు చెబుతున్నారు. బెంచీల కొరత ఉంది. బిల్డింగ్ ఎత్తులో ఉండటంతో తా గునీరు రావడం లేదు. దీంతో నెలకు రూ.2వేలు నీళ్లకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఆర్వో ప్లాంట్ పని చేయడం లేదు.
జీబీహెచ్‌ఎస్ జనపాడ బాగ్ అంబర్పేట్
నాలుగు అంతస్తుల భవనం. 12 గదులు ఉన్నాయి. ఇక్కడ మరో రెండు గదుల అవసరం ఉంది. 204 మంది విద్యార్థులు ఉండగా..11 మంది టీచర్లు ఉన్నారు. మరో ఇద్దరు కావాల్సి ఉంది. ఆట స్థలం లేదు. పక్కనే ఉన్న ప్రభుత్వం స్థలం కేటాయిస్తే విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం ఉందని టీచర్లు చెబుతున్నారు. పాఠశాల కాంపౌండ్ ఆవరణలో భారీ చెట్టు ఉండటంతో ప్రహరీ గోడ కూలి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కొద్ది రోజులుగా ఆర్వో ప్లాంట్ పని చేయడం లేదు. నీటికి కొరత లేదు. స్కావేజంర్ లేకుంటే శుభ్రత అంతే. భారీ వర్షాలు వచ్చినప్పుడు తరగతి గదు ల్లోకి నీరు వస్తోంది. ఫ్యాన్లు లేవు, లైట్లు కొరత ఉంది. పై అంతస్తుల్లోని టాయిలెట్లు శుభ్రం చేసే సమయంలో గోడల వెంబడి అపరిశుభ్రమైన నీరు లీక్ అవుతుంది. గొడ వెంబడి ఇప్పటికే క్రాక్‌లు ఏర్పడ్డాయి.
50 ఏండ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల..
ముషీరాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠ శాల దాదాపు 50 ఏండ్ల పాత భవనం. ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. జీహెచ్ఎంసీ రెండు సార్లు నోటీసులు ఇచ్చింది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఎప్పుడు కూలుతుందోనని భయంతోనే అక్కడి టీచర్లు, పిల్లలు గడుపుతున్నారు. ఇదే బిల్డింగ్‌లో ఇటీవల వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేయగా.. ఓ రోజు జిల్లా కలెక్టర్ సందర్శనకు రాగా.. పాత భవనం అని తెలిసి అడుగు కూడా పెట్టలేదం ట.. ఇక్కడ 20 గదులు అవసరం ఉండగా.. 7 మాత్రమే ఉన్నాయి. హెచ్ఎం, ల్యాబ్, రెస్ట్, ఉర్దూ స్టాఫ్, పీటీఈ స్టాఫ్ రూం, స్టోర్ రూమ్స్ అవసరముంది.
బాగు చేసేందుకు మంచి అవకాశం
ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించేందుకు ఇదే మంచి తరుణం. బడు లు తెరిచేందుకు మరి కొంత సమయం ఉంది. ఈలోగా సౌకర్యాలు లేని చోట కల్పనకు చర్యలు తీసుకోవాలి. మరమ్మ తులు, అదనపు గదులు అవసరమైతే ఆ మేరకు అధికారులు చర్యలు చేపట్టాలి. మౌలిక సౌకర్యాలు ఉంటేనే విద్యా ర్థులు పాఠశాలలకు వస్తారనే విషయం గుర్తుంచుకోవాలి.
ఏ.శ్యామ్ సుందర్, అధ్యక్షుడు, టీఎస్‌యూటీఎఫ్, హైదరాబాద్ జిల్లా