Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి
నవతెలంగాణ-హస్తినాపురం
మోడీ సర్కారు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలతో దేశంలో కార్పొరేట్ శక్తుల ఆస్తులు 70 శాతం పెరిగాయనీ, పేదలు మాత్రం మరింత పేదలుగా మారు తున్నారని సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. శుక్రవారం భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని నందనవనం శాఖ మహాసభ కమర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. కరోనా టైంలో పేద, మధ్యతరగతి ప్రజలు తిండి, వైద్యం అందక తిప్పలు వడుతుంటే.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నిరుద్యోగం, ఉపాధి లేమి, ధరల పెరుగుదలతో జనజీవనం పై భారం పడుతోందనీ, ప్రజలు అవస్థలు పడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ, ప్రజ ల పక్షాన పోరాడుతోందని తెలిపారు. అనంతరం జరిగిన శాఖా మహాసభలో పలు తీర్మానాలను ప్రవేశ పెట్టారు. నందనవనంలో ఉన్న బస్తీ దవాఖానను ప్రాథ మిక ఆరోగ్య కేంద్రంగా ఏర్పాటు చేయాలనీ, నందనవ నంలో నివసి స్తున్న అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలనీ, బెల్టు షాపులను ఎత్తే యాలనీ, ప్రభుత్వ జూని యర్ కాలేజీని ఏర్పాటు చేయాలని కోరారు. అర్హు లైన అందరికీ రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు ఇవ్వాలనీ, డ్రయినేజీ సమస్యను పరిష్క రించాలని శాఖ మహాసభలో తీర్మానించడంతో సభ ఏకగ్రీ వంగా ఆమోదించింది. అనంతరం నందనవనం పార్టీశాఖ నూతన కార్యదర్శిగా ఆలేటి ఎల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు ధర్మా నాయక్, రంగారెడ్డి జిల్లా కోర్ కమిటీ సభ్యు లు ఎం. చంద్రమోహన్, రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కీసరి నర్సిరెడ్డి, శాఖ కార్యదర్శి కస్తూరి శీను, శాఖ సభ్యులు కమ ర్ జీ.రవీందర్, ఎం.యాదయ్య, కె.రాములు, యాదయ్య, పాండు నాయక్, యాదగిరి, లక్ష్మయ్య పాల్గొన్నారు.