Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కిల్స్ వారీగా పనుల కోసం ప్రణాళికలు
- ఈనెల 23న ఆలయాల్లో కలశ స్థాపనతో ఉత్సవాల హడావుడి ప్రారంభం
- ఉమ్మడి ఆలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు బత్తుల బల్వంత్ యాదవ్
నవతెలంగాణ-చాంద్రాయణగుట్ట
పాతబస్తీ బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.6 కోట్ల నిధులు విడుదల చేసిందని భాగ్యనగర్ శ్రీమహాంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు బత్తుల బల్వంత్ యాదవ్ తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ తదితర అంశాలపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆషాఢ మాసం పాతబస్తీ బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం రూ.6 కోట్ల నిధులు విడుదల చేసింనది, ఈనెల 23న ఆలయాల్లో కలశ స్థాపనతో బోనాల హడావుడి మొదలవుతుందన్నారు. చాంద్రాయణ గుట్ట సర్కిల్-8 పరిధిలో రూ.1,31,20,000 లతో 40 పనులు, చార్మినార్ సర్కిల్-9 పరిధిలో రూ.1,07,50,000 లతో 21 పనులు, ఫలక్ నుమా సర్కిల్-10 పరిధి లోని బహదూర్ పురా నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో రూ.33.68 లక్షలతో 10 పనులను, రాజేంద్రనగర్ సర్కిల్-11లో పరిధిలో రూ.53.26 లక్షలతో 14 పనులను నిర్వహించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారని వివరించారు.
గతేడాది కరోనా వైరస్ వ్యప్తి కారణంగా బోనాల జాతర ఉత్సవాలు నిరాడంబరంగా జరిగాయన్నారు. ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని, అందుకే తాము కూడా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించి నగరంలోని అమ్మవార్లకు బంగారు బోనంతో పాటు పట్టువస్త్రాలు అందజేస్తామన్నారు. అమ్మవారి ఆలయాలకు చెందిన ఉత్సవాల నిర్వాహకులకు ఈనెల 26, 27 తేదీల్లో ప్రభుత్వం నుంచి కేటగిరీల వారిగా చెక్కులు లభించనున్నాయని పేర్కొన్నారు. భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.