Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
భారీ వర్షాలకు కప్రాయి చెరువుకు చేరుతున్న వరద నీరు చేరిందని, చెరువు గరిష్ఠ నీటి మట్టానికంటే అదనపునీరు కాలనీలోకి ప్రవేశించకుండా యుద్ధప్రాతిపదికన నీటిని తాత్కాలిక కాలవ ద్వారా బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నట్లు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం చెరువును పరిశీలించారు. శాశ్వత పరిష్కారం దిశగా కషి చేస్తున్నామని చెప్పారు. ఆలస్యం అయినందుకు కాలనీ వాసులు సహకరించాలని కోరారు. గత అనుభవాలను దష్టిలో ఉంచుకుని తిరిగి అదేవిధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఒక ప్రణాళిక రూపొందించామన్నారు. ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరక్టర్ అనిల్ చౌదరి, మహిళ విభాగం అధ్యక్షురాలు ఇందిరా రెడ్డి, ఉమేష్ గౌడ్, రాఘవేందర్రావు మునగాల, పోగుల రాంబాబు, సంతోష్, వెంకట్‌రెడ్డి, హరిహరపురం కాలనీ అధ్యక్షులు హన్మంత్ రెడ్డి, జనరల్ సెక్రటరీ జనార్ధన్ రెడ్డి, శంకరయ్య, సందీప్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, విజరు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర కాలనీ అధ్యక్షులు రాంబాబు, కాలనీ వాసులు పాల్గొన్నారు.