Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోమటి రవి
నవతెలంగాణ-మల్కాజిగిరి
కరోనాను పూర్తిగా అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ(ఎం) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోమటి రవి అన్నారు. నేరేడ్మెట్ డివిజన్లోని ఆర్కే పురంలో సీపీఐ(ఎం) శాఖ మొదటి సమావేశాన్ని నిర్వహించారు. కోమటిరవి, సీపీఐ(ఎం) మల్కాజిగిరి సర్కిల్ కార్యదర్శి కృపాసాగర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరవి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు డబుల్బెడ్రూమ్లతో పాటు కేసీఆర్ చెప్పిన దళితులకు 3 ఎకరాల భూమిని పంచాలన్నారు. రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచే విధానాలు అవలంభిస్తోందన్నారు. అనంతరం నేరేడ్మెట్ డివిజన్ సీపీ(ఐ)ఎం సభ్యులు లక్ష్మణ్ పార్టీ కార్యకలాపాల గురించి వివరించారు. శాఖ నూతన కార్యదర్శిగా వైష్ణవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో పార్టీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.