Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయంజాల్
నిధులు కేటాయింపులో సామన్యాయం పాటించాలి అని తుర్కయంజాల్ టీిఆర్‌ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రామావత్ కల్యాణ్ నాయక్ అన్నారు. ఆదివారం తుర్కయంజాల్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డులకు ఒక విధంగా, టీఆర్ఎస్ పార్టీ వార్డులకు ఒక విధంగా నిధులు కేటాయిస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ మల్ రెడ్డి అనురాధ రాంరెడ్డిని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ నిధులను పక్కదారి మళ్లిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్ పర్సన్‌కు రాజకీయ వ్యవహారం తెలియదని అన్నారు. గత సంవత్సర కాలంలో 20 కోట్ల అభివద్ధి పనులు జరిగితే అందులో కేవలం 3 కోట్లు టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు కేటాయించడం ఎంత వరకు సమంజసమని పేర్కొన్నారు. ఇప్పటికైనా సమన్వయంతో పనిచేసి అన్ని పార్టీలకు సమాన బడ్జెట్ కేటాయించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తుర్కయాంజల్ మున్సిపాలిటీ టీఆరెస్ పార్టీ అధ్యక్షుడు కందాల బలదేవ రెడ్డి, కౌన్సిలర్లు పుల్లగుర్రా కీర్తన విజయానంద రెడ్డి, భాగ్యమ్మ ధనరాజ్, సంగీత మోహన్ గుప్తా, స్వాతి అమరెందర్ రెడ్డి, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.