Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
నిజాంపేట్ పరిధిలో బీజేపీ నాయకులు కరెంటు పోల్‌కు పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు కడుతుండగా 10వ డివిజన్ కార్పొరేటర్ మేకల వెంకటేష్ బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు పాల్పడిన ఘటనపై చర్యలు తీసుకోవాలని ఈ మేరకు శనివారం రాత్రి బాచుపల్లి పోలీస్ స్టేషన్లో బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. బీజేపీ నాయకుల మండల కార్యవర్గ సమావేశం నేపథ్యంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతినగర్, బాచుపల్లిలో జెండాలు ఫ్లెక్సీలు కడుతూ, నిజాంపేట్ ఎస్బిఐ నుంచి పుష్పక్ అపార్ట్మెంట్ వరకు బీజేపీ జెండాలు కరెంట్ పోల్స్‌కు కడుతున్న సమయంలో రేణుక ఎల్లమ్మ టెంపుల్ నుంచి పదవ వార్డ్ కార్పొరేటర్ మేకల వెంకటేష్ రోడ్డు మీదికి వచ్చి బీజేపీ పార్టీ జెండాలు ఎందుకు కడుతున్నావు, చంపేస్తా నాకొడుకల్లారా అంటూ బెదిరించడమే కాకుండా బీజేవైఎం అధ్యక్షులు రవీంద్ర, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ముఖేష్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సాయిమాదిగపై చేయి చేసుకుని, ఇష్టానుసారంగా కొట్టడమే కాకుండా కాళ్లు మొక్కించుకున్న ఘటనపై ప్రజాస్వామ్యంలో కార్పొరేటర్ దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నామని తెలిపారు. రాత్రి జరిగిన సంఘటనకు నిరసనగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు విక్రమ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్ ఆధ్వర్యంలో జిల్లా, రాష్ట్ర నాయకులు కలిసి బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు బీజేపీ పార్టీపై కక్షగట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులపై దాడులకు తెగబడితే ఊరుకునే సమస్య లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర స్కాలర్షిప్ సెల్ జాయింట్ కన్వీనర్ దాసి నాగరాజు, ఎస్టీ మోర్చా అధ్యక్షులు రాంచందర్ నాయక్, ఎస్సీ మోర్చ ఉపాధ్యక్షులు అమతయ్య, ప్రధాన కార్యదర్శులు బిక్షపతి కష్ణ, నరేంద్ర చౌదరి, కార్పొరేషన్ ఉపాధ్యక్షులు శివ కోటేశ్వరరావు చౌదరి, విష్ణువర్ధన్, డాక్టర్ శ్రీనివాస్, సంతోష్ కుమార్, కార్యదర్శులు అరుణ్, లక్ష్మణ్, ప్రసాద్ సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు శివ, రవి, సురేష్ ఓబీసీ మోర్చా అధ్యక్షురాలు మదన్, ప్రధాన కార్యదర్శి ముఖేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు రమాదేవి, ఉపాధ్యక్షురాలు పావని, ఐటీ సెల్ కన్వీనర్ శరత్, బీజేవైఎం అధ్యక్షులు రవీంద్ర, ప్రధాన కార్యదర్శి సాయి మాదిగ, ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు రాము తదితరులు పాల్గొన్నారు.