Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతి అక్రమాలకు తావులేకుండా కొత్త నాయకుల తయారుకు ఎంతటి కష్టానికైన సిద్ధం : తీన్మార్ మల్లన్న
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక జీతగాడని, సక్రమంగా పనిచేయకపోతే అయనని దించి ఇంకొకన్ని పెట్టుకుం టామని, మూడేళ్ల తర్వాత వచ్చేది ప్రజా పాలననే అని తీన్మార్ మల్లన్న అన్నారు. ఘట్కేసర్ మండలం కొర్రెముల పరిధిలోని జేకే కన్వెన్షన్ హాల్లో సోమవారం ''యుద్ధం మిగిలే ఉంది'' తీన్మార్ మల్లన్న టీమ్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోవు రోజులలో ప్రజలే పాలకులని (చింతపండు నవీన్ కుమార్) తీన్మార్ మల్లన్న వాఖ్యనించారు.
మిమ్మల్నందరినీ పాలకులను చేయడమే తన లక్ష్యమన్నారు. దానికొరకు ఎంతటి కష్టాలైన ఎదుర్కొంటానని అన్నారు. మనం ఎవనిచేతుల్లోనో పావులు, బానిస కాకూడదన్నారు. వచ్చే నెల ఆగస్ట్ 29న (పాత మహబూబ్‌నగర్) గద్వాల జిల్లా నుంచి పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నామని, విద్య, వైద్యంపైనే మా దష్టి ఉంటుందన్నారు. మేము ఎవరం కూడా ప్రజా ప్రతినిధులుగా వచ్చినా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని, చదివిస్తామని అన్నారు. ప్రతి ప్రతినిధి కూడా ప్రజల కోసమే పనిచేయాలి. తీన్మార్ మల్లన్న అలా పనిచేస్తారు. చేయిస్తాడు అని అన్నారు. ప్రతి మండలంలో బహిరంగ సభ పెడతా. మా టీమ్‌లో ప్రతి కార్యకర్త, ప్రతి సభ్యుడు కూడా ప్రజలు, వారి సేవల కోసమే పనిచేస్తారు. తీన్మార్ మల్లన్న రాబోవు రోజుల్లో ఎన్నో మార్పులు చేస్తామని, అందుకు ప్రతి ఒక్కరి సాయం, మద్దతు కావాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటిని ప్రకటించారు.