Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ అభివద్ధిని ఎపుడూ అడ్డుకోదు
- చల్ల నర్సింహారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం చెరువుల సుందరీకరణ పనుల పేరుతో చెరువుల భూములను కబ్జా చేయటంతో పాటు కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సిహ్మారెడ్డి, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్త శివసేనారెడ్డి, ఎన్ ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బాలరామ్లు అన్నారు. ఆదివారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాస్‌గూడలో ఉన్న చెరువుల సుందరీకరణ పనుల పేరుతో ఆక్రమణకు గురవుతున్న చెరువులను కాపాడాలని మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు చల్లా నర్సిహ్మరెడ్డి, రాష్ట్ర ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మహేశ్వరం నియోజక వర్గం సీనియర్ నాయకులు దేప భాస్కర్‌రెడ్డి, రంగారెడ్డి జెడ్ పి.మాజీ ఫ్లోర్ లీడర్ జంగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ బంగారు సత్యనారాయణలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సుందరీకరణ పేరుతో కబ్జాకు గురవుతున్న చెరువులను, వర్షపు నీటితో ముంపునకు గురైన కాలనీలో పర్యటించారు. చెరువులోకి మురికి నీరు చేరకుండా, డ్రయినేజీ నిర్మాణ పనులు చేపట్టకుండా చెరువులను సుందరీకరణ చేయటం ఏమిటని ప్రశ్నించారు. చెరువుల నుండి వచ్చే వరద నీటితో బడంగ్పేట్, మీర్పేట్ కార్పొరేషన్లు, జల్పల్లి మున్సిపల్లోని అనేక కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారిని అదుకునే నాధుడే కరువయ్యారని వారు అందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బి.గోవర్ధన్రెెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నవారు మల్లారెడ్డి, బొయపల్లి వెంకట్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బిక్షపతిరెడ్డి, లగ్గాల మధు, అర్.చంద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సందీప్ రెడ్డి, వి.వంశి, వివేకనందారెడ్డి, కష్ణారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.శాంత్ రెడ్డి, మంత్రి మహేష్ ముదిరాజ్, లోకమ్, బీజేవైఎం యువ నాయకులు పెద్దబావి నాగనందీశ్వర్ రెడ్డి, భువన చందర్, కొత్తగా పార్టీలో చేరిన నరేష్, సతీష్ గౌడ్, తారకేష్, ఆంజనేయులు, రాజు, శివ, ఆశీస్, రాజు, మురళీ పాల్గొన్నారు. అనంతరం బీజేవైఎం బడంగ్ పేట కార్పొరేషన్ ఆర్టీఐ సెల్ కన్వీనర్‌గా సునీల్ కుమార్‌కు నూతన పదవీ బాధ్యతలు అప్పగించారు.