Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ భారతీయ జనతాపార్టీ విస్తత స్థాయి కార్యకర్తల సమావేశం డివిజన్ పరిధిలోని శ్రీరామణ కాలనీలో నిర్వహించారు. ఈ సమావేశానికి డివిజన్ అధ్యక్షులు పి.నరేష్ యాదవ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా రంగారెడ్డి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి మారం వెంకటేష్ విచ్చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని మరింత పటిష్టపర్చుటకు మార్గనిర్దేశం చేశారు. స్థానిక కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేద్దామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, డివిజన్లో అభివద్ధికి కషి చేస్తామని ప్రతి కార్యకర్తను పార్టీలో భాగస్వామ్యం చేసి పార్టీని బలోపేతం చేస్తామని వారు ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు కె.రాజేంద్రప్రసాద్, కార్యవర్గ సభ్యులు గజ్జల రాజుగౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శులు బీరం అమరేందర్ రెడ్డి, ఎరుకల మల్లేష్ గౌడ్, రాష్ట్ర కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొగ్గుల మాధవ రెడ్డి, జిల్లా హెల్త్ సెల్ కన్వీనర్ దొండేటి పార్ధురెడ్డి, బీజేవైయం జిల్లా ప్రధాన కార్యదర్శి మారం శ్రీధర్, జిల్లా మహిళామోర్చా కార్యదర్శి అరుణా సింగ్ తదితరులు పాల్గొన్నారు.