Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి విజరు
- మేడ్చల్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ-ఏఎస్రావు నగర్
రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అనేక హామీలను విస్మరించిందనీ, ఇప్పటి వరకు నెరవేర్చలేదని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి విజరు అన్నారు. డీివైఎఫ్ఐ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రెండో మహాసభ, నూతక మిటీ ఎన్నిక అనం తరం సీఐటీయూ ఆఫీస్ దగ్గర్ నుంచి ఈసీఐ ఎల్ అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహి ంచారు. ఈ సందర్భంగా విజరు మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ప్రభుత్వం మాత్రం 50 వేలను మాత్రమే భర్తీ చేస్తామని ఈ మధ్య కాలంలో ప్రకటనలు చేసిందని గుర్తు చేశారు. డీవైఎఫ్ఐ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అన్ని భర్తీ చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి రెండో మహాసభ నుంచి డిమాండ్ చేశారు. స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం హామీ ప్రకారం ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇప్పటిదాకా హామీని నిలబెట్టుకోలేదన్నారు. కేంద్రంలో ఉన్న ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలనీ, పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు కె.రవి, డీవైఎఫ్ఐ మాజీ కార్యదర్శి రాజశేఖర్, ఆంజనేయులు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శంకర్, తదితరులు పాల్గొన్నారు.
నూతక కమిటీ ఇలా..
డీవైఎఫ్ఐ మేడ్చల్-మల్కాజిగిరి నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా ముష్యం కిరణ్ రాథోడ్, సంతోష్, జిల్లా ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్, నరేష్, భాస్కర్, జిల్లా సహాయ కార్యదర్శిగా జహీర్, వెంకటాచారి, లక్ష్మణ్తోపాటు నూతన కమిటీని 23 మందితో ఏర్పాటు చేశారు. జిల్లాలోని 16 మండలాల నుంచి ఎన్నిక చేశారు.