Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
దళితుల హక్కులకు భంగం కలిగించే వారికి తగిన బుద్ధి చెబుతామని తెలంగాణ మాలమహానాడు అధ్యక్షుడు పిల్లి సుధాకర్ హెచ్చరించారు. నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని జేజేనగర్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోమన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి పేరుతో చేస్తున్న మోసాన్ని ఎండగడుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేయడం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లకు వ్యతిరేక మన్నారు. ఎవరైనా రాజర్వేషన్లు తీసేయాలని ప్రయత్నిస్తే భవిష్యత్లో జరిగే పరిణామాలకు వారే బాధ్యులవుతారని మాలమహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి బైరీ రమేష్ హెచ్చరించారు. రాష్ట్రంలో దొరల పాలన తిరిగి కొనసాగు తుందన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దళితులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలను గమనిం చాలనీ, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను వినియోగించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర కార్యనిర్వహాక అధ్యక్షుడు పి.చంద్రశేఖర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధి తులకు సకాలంలో న్యాయం చేయలేకపోతుంద న్నారు. ఇటీవల దళితుల అభ్యున్నతి పేరుతో కేసీఆర్ చేస్తు న్న ప్రకటనలు చిత్తశుద్ధితో చేస్తున్నవి కాదని విమర్శి ంచారు. త్వరలోనే దళితుల ఐక్యంగా తమ హక్కుల కోసం ఉద్యమిస్తారని పాల్గొన్న నాయకులు చెప్పారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఇన్చార్జిలను రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ప్రకటించారు. త్వరలోనే హైదరాబాద్లో అన్ని పార్టీల నాయకులతో దళితుల సాధికారత పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్ర మంలో తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు రాష్ట్ర, జిల్లా స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.