Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మల్కాజిగిరి సర్కిల్ కార్యదర్శి కృపాసాగర్
నవతెలంగాణ-మల్కాజిగిరి
ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ(ఎం) మల్కాజిగిరి సర్కిల్ కార్యదర్శి కృపాసాగర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎం) శాఖ సమావేశాలను నిర్వహించాల ని ఇచ్చిన పిలుపు మేరకు మౌలాలి డివిజన్లోని కామ్రేడ్ పిల్లి నర్సింగ్‌రావు నగర్ కాలనీలో పార్టీ శాఖ మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కృపాసాగర్ ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించి మాట్లా డారు. మోడీ సర్కారు దేశ అభివృద్ధికి దోహదపడే ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలను, ప్రైవేటు పరం చేస్తుంద న్నారు. ఉద్యోగం కల్పించకలేక యువతకు నిరుద్యోగ భృతి ఆశ చూపించి అమలు చేయడం లేదన్నారు. కార్మిక హక్కు లను కాలరాసే చట్టాలను చేస్తున్నారని తెలిపారు. ప్రజల అవసరాలు తీర్చలేక కుల మతాలను రెచ్చగొట్టడం రిజర్వే షన్ గొడవ సృష్టించడం చేస్తున్నారని చెప్పారు. ధరలు విపరీతంగా పెరిగినా పట్టిచుకోవడం లేదన్నారు. పెట్రో ల్, డీజీల్, గ్యాస్ ధరలకు అదుపు చేయడంలో మోడీ సర్కార్ ఫెjయిల్ అయ్యిందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న మోడీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సీపీఐ (ఎం) ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆ పార్టీ నాయకులు బి.నర్సింగ్‌రావు తెలిపారు. అనంతరం పి.మంగ కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. సమావేశా నంతరం శాఖ నూతన కార్యదర్శిగా పి.మంగను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. ఆమె మాట్లాడుతూ కాలనీలో పార్టీ బలపడాలంటే సమస్యల మీద కేంద్రీకరించి, ప్రతి సభ్యుడు తప్పకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. గతంలో పోరాడి సాధించిన కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశానికి పార్టీ సభ్యులు సంజీవ, వెంకటయ్య, సురేందర్, ఆంజనేయులు, శాంతమ్మ, పుష్ఫ పాల్గొన్నారు.