Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కె.ఎం.ప్రతాప్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
తెలంగాణేతర ప్రజల ఆస్తులకు రక్షణగా నిలుస్తామని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కె.ఎం.ప్రతాప్ అన్నారు. ఆదివారం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని భద్రసాయినగర్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారి లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసుకుని ఇండ్లు నిర్మించుకుంటుండగా వారి స్థలాలను అక్రమించి ప్రహరీ గోడను కొందరు కబ్జాదారులు నిర్మిస్తుండడంతో సమస్యను కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కె.ఎం.ప్రతాప్‌కు వివరించారు. వెంటనే స్పందించిన ఆయన కుత్బుల్లాపూర్ సర్కిల్ డీసీకి సమస్యను తెలిపి అక్రమ నిర్మాణాలను కూల్చివేయించారు. ఈ సందర్భంగా ఆదివారం కాలనీవాసులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సన్మానించారు. తెలంగాణేతర ప్రజల ఆస్తులకు అండగా ఉండి అన్యాయాన్ని ఎదురిస్తామన్నారు. కొనుగోలు చేసిన స్థలాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామన్నారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.