Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు
నవతెలంగాణ- సుల్తాన్‌బజార్
దశాబ్దాల కాలంనుండి సామాజికంగా ఆర్థికంగా వెనకబడి పేదరికంలో మగ్గుతున్న దళితుల కుటుంబాలలో వెలుగులు నింపాలనే ఆలోచనతోనే కేసీఆర్ దళితబంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ రావు అన్నారు. నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని చింతల్ బస్తి, వీర్ నగర్ బస్తీలో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, నాంపల్లి ఇన్చార్జి అనంద్ కుమార్‌గౌడ్, పలు దళిత సంఘాల నాయకులు, టీఆరెస్ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభి షేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ. కేవలం తాత్కాలిక తాయి లాలతో దళితులను ఓట్లకోసం వాడుకునే నాయకులే దేశమంతా ఉన్నారని కానీ వారికి భిన్నంగా తెలంగాణలోని దళితుల కుటుంబాలలో పేదరికాన్ని సమూలంగా తొలగించి వారిని ఆర్థికంగా నిలబెట్టాలనే కేసీఆర్ ప్రయత్నం అభినందనీయం అని అన్నారు. దళితబంధు దళితుల జీవితాల్లో ఒక గొప్ప మార్పు తీసుకువస్తుంది.కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధుతో వ్యవసాయరంగానికి రైతుల జీవితాల్లో మార్పు వచ్చినట్టు దళితబంధుతో అణగారిన పేద దళిత కుటుంబాలకు కొండంత ఆసరా దొరికి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. దళిత బంధుతో కేసీఆర్ తెలంగాణలొనే కాదు యావత్ దేశంలోనే దళితుల ఆత్మబంధువుగా చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారు అని పేర్కొన్నారు. యావత్ దళిత సమాజం పక్షాన కేసీఆర్‌కి మనస్ఫూర్తిగా కతజ్ఞతలు తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్, టీిఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.