Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్
- బక్రీద్ ఏర్పాట్లపై సమన్వయ సమావేశం
నవతెలంగాణ-దూల్పేట్
బక్రీద్ పండగ సందర్బంగా పారిశుధ్య సమస్య లు తలెత్తకుండా ప్రత్యేక బక్రీద్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటు న్నామని జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ జోనల్ కమి షనర్ సామ్రాట్ అశోక్ తెలిపారు. బక్రీద్ పండగను పురస్కరించుకుని చాంద్రాయణ గుట్ట నరికీ పూల్ బాగ్ లోని జోనల్ కార్యాలయంలో మంగళవారం ఆయన డీసీలు, పోలీసులు, పలు విభాగల అధికా రులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మాట్లాడుతూ జంతు వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక బృందాలను సర్కిళ్ల వారీగా ఏర్పాటు చేశామన్నారు. డీసీలు, ఏఏం హెచ్ఓల పర్యవేక్షణలో ఏఈ, సూపర్వైజర్లు, సానిటరీ జవాన్, ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించామన్నారు. జంతు వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తరలించేందుకు 295 ప్రత్యేక వాహనాలు, 73 జేసీబీలు,, 3 బాబ్ కట్లను ఏర్పాటు చేశామన్నారు. చెత్త, జంతు వ్యర్ధాలను పోగు చేసేందుకు ఇమ్లిబన్ ఐ బీటీతోపాటు కిషన్‌బాగ్, కాటేదాన్, బండ్లగూడ ప్రాంతాల్లో తాత్కాలిక డంపింగ్ యార్డులను ఏర్పాటు చేశామన్నారు. పోలీసుశాఖ సమన్వయంతో పారిశుధ్య సమస్యలపై తక్షణమే స్పందించేందుకు రౌండ్ ది క్లాక్ సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో గార్బేజ్ కవర్లను పంపిణీ చేశామ న్నారు. ఎక్కడ పారిశుధ్య సమస్యలపై ఫిర్యాదుల రాకుండా పని చేయాలని అధికారులను ఆదేశిం చారు. ప్రజలందరూ తమ సిబ్బందికి పూర్తిగా సహకరించాలని కోరారు.
ప్రత్యేక విభాగం ఇంచార్జ్‌లు
మలక్‌పేట విజరు భాస్కర్ (7995009102), నజీర్ హుస్సేన్ ( 8096993458), సంతోష్‌నగర్ ఇంతియాజ్ (9032094989), విజరు భాస్కర్ (7995009102), చాంద్రాయణగుట్ట శివ (8019935953), మహేందర్ (8919821230), చార్మినార్ శ్రీధర్ (9032878785), రాజేష్ (7013361912), ఫలక్‌నుమా సాయి శ్రీనివాస్ (7036291464), రవికాంత్ (832821659), రాజేంద్రనగర్ నాగేందర్ (8328697549), జగదీష్ (7995009092) రౌండ్ ది క్లాక్ జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ కంట్రోల్ రూంలో సంప్రదించాలని సూచించారు. ఈ సమా వేశంలో జాయింట్ కమిషనర్ డీడీ నాయక్, మలక్ పేట్, సంతోష్‌నగర్, చార్మినార్, ఫలక్‌నుమా, రాజేం ద్రనగర్ సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు రజనీకాంత్‌రెడ్డి, అలివేలు మంగతాయారు, సూర్యకుమార్, రాజేందర ్రెడ్డి, జగన్, యూబీడీ డిప్యూటీ డైరెక్టర్ నాగిరెడ్డి, వెటర్నరీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, బీఏఏంహెచ్ఓలు డాక్టర్ శివ ప్రసాద్, డాక్టర్ పాల్వాన్ కుమార్, డాక్టర్ పద్మ, డాక్టర్ మున్నవర్ అలీ, రవాణా విభాగం సీటీఓ రాధిక, డీసీటీఓ వినరు భూషణ్, పొలీసు అధికారులు, జోనల్ కమిషనర్ సీసీ గుంటు గిరి బాబు, తదితరులు పాల్గొన్నారు.