Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్‌లోని శ్రీ పాండురంగ విఠలేశ్వర వెంకటాద్రి ఆలయంలో మంగళవారం ఘనంగా తొలి ఏకాదశి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ఆకుల రూపతో పాటు పలువురు ప్రము ఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కరణ్‌కుమార్ అధ్యక్షతన ధర్మకర్త ధర్మకర్తలు శ్రీహరి భాస్కర ముదిరాజ్, సందీప్ కుమార్, రాజగోపాలచారి పూజలకు వచ్చిన ప్రముఖులకు శాలు వాలు కప్పి సన్మానించారు. ఆలయ ఈవో సురేందర్ పర్యవేక్షణలో సిబ్బంది భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమాలు నిర్వహించారు.
అల్వాల్ : తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అల్వాల్‌లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా బాలాజీ వెంకటేశ్వర ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో నరేందర్, మాజీ ధర్మకర్త మెంబర్ వెంకటరా మ్‌రెడ్డి దంపతులు శివరామకృష్ణ భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రఘు, పంతులు శ్రీనివాస్ పాల్గొన్నారు.