Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముస్లింల అభ్యున్నతికి కేసీఆర్ కృషి
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-మలక్‌పేట్/బగంగ్పేట
బక్రీద్ పండగ త్యాగానికి, సేవానిరతికి ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈదుల్ అజ్ హా (బక్రీద్ పండగ) ప్రార్థనల సందర్భంగా మంత్రి ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజే శారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వారు, స్థోమత ఉన్న ముస్లిం సోదరులు ఖుర్భాని ద్వారా పేదలకు పంచ టం గొప్ప విషయం అన్నారు. అందరూ పండగ ను కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇది మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. బక్రీద్ పండగను ఆదర్శంగా తీసు కొని పేదలకు అండగా నిలువటానికి అందరూ ముందుకు రావాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాలు, మతాల అభ్యున్నతికి పాటు పడుతున్నారని పేర్కొన్నారు. కరోనా నుంచి విశ్వ మానవాళి రక్షణ కోసం ప్రార్థించాలని ముస్లిం, మైనారిటీలకు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది నుంచి హజ్‌యాత్ర యధావిధిగా జరిగేలా అల్లాను ప్రార్తించాలని కోరారు.