Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఎరోనాటికల్ ఇంజినీరింగ్ విభాగానికి ఉత్తమ క్రీయాశీల విభాగంగా అవార్డు లభిం చింది. ఎంఎల్ఆర్ఐటీలోని ఏరోనాటికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఎంఎస్న్ గుప్తకు ఐఏఏఏ ప్రొఫెషనల్ అసోసియేషన్ ద్వారా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉత్తమ క్రియాశీలక ఉపాధ్యాయులు, అసోసియేషన్ ద్వారా ఎక్కువ కార్యక్రమాలను చేసి విద్యార్థుల్లో ఎరోనా టికల్ ఇంజినీరింగ్ గురించి లోతైన అవగాహన కలిగించినందుకుగాను ఎరోనాటికల్ విభాగానికి క్రియాశీలక విభాగంగా విశిష్టమైన గుర్తింపు లభించింది. తమిళనాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ తిరు అంబిల్ మహేష్ పొయ్యమోజ్హి చేతుల మీదుగా ఈ పురస్కార ప్రధానం జరిగింది. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ ఎరోనా టికల్ విభాగం పలు కార్యక్రమాలను నిత్యం నిర్వహిస్తూ విద్యార్థులకు ఏవియేషన్ గురించి, ఈ రంగంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా తమ విద్యార్థులను సిద్ధం చేస్తున్నం అని పేర్కొన్నారు. కాలేజీ కార్యదర్శి మర్రి రాజశేఖరరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కే.శ్రీని వాస్ రావు ఈ సందర్భంగా గుప్తా, ఇతర అధ్యాపకులను అభినందించారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలకు చెందిన ఎరోనాటికల్ ఇంజినీరింగ్ విభాగానికి ఈ అరుదైన గౌరవం తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. తమ కళాశాలను ఎరోనాటికల్ ఇంజినీరింగ్ విభాగంలో రాష్ట్రంలోనే అత్యుత్తమమైన విభాగంగా తయారు చేస్తున్నామని తెలిపారు. విభాగంలోని లాబొరేటరీస్‌లో సూపర్ సోనిక్ విండ్ టన్నెల్, కంపోసిట్ మెటీరియల్ లాబరేటరీ, సిములేటర్ వంటి అత్యాధునిక పరికరాలతో పటిష్టంగా తయారు చేశామన్నారు. ఈ ఏడాది అత్యధికంగా ప్లేస్ మెంట్స్ సాధించామనీ, 90శాతం విద్యార్థులు నియామ కాలు సాధించామనీ, అతర్జాతీయ స్థాయి సంస్థలు, అమెజాన్, టీసీఎస్, ఇన్ఫోసిన్, క్యాప్ జెమినీ, అసెంచర్, ఎల్టీఐ, కాగ్నిజెంట్, ఈ-పామ్, విప్రో తదితర సంస్థలు విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు తమ కళాశాలలో కల్పించాయని తెలిపారు.