Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూజీసీ ద్వారా రాష్ట్రంలోని వర్సిటీలపై కేంద్రం పెత్తనాన్ని సహించం
- కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ లేఖ రాయాలి
- రౌండ్ టేబుల్లో ఓయూ జేఏసీ టీఎస్ జేఏసీ డిమాండ్
నవతెలంగాణ-ఓయూ
రాష్రంలో ప్రభుత్వ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుంటే ఊరుకునేది లేదని, ఉద్యమానికి సిద్ధం అవుతామని వక్తలు తెలిపారు. వర్సిటీల విషయంలో యూజీసీ, ఉన్నత విద్యామండలి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మంగళవారం ఓయూ జేఏసీ-టీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడి ప్రొ.రామ్‌రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెమినార్ హాల్లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. విద్యార్థి జేఏసీ నాయకులు మాట్లాడారు. కేంద్ర సర్కారు యూజీసీ ద్వారా రాష్ట్రంలోని యూనివర్సిటీలపై పెత్తనం చేస్తూ వాటి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని, ఈ విధమైన చర్యలను సహించేది లేదని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం యూజీసీ ద్వారా రాష్ట్ర యూనివర్శిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీసే నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ యూజీసీకి, ప్రధానికి లేఖ రాయాలని డిమాండ్. యూజీసీ పీహెచ్డీ కోసం ఉమ్మడి పరీక్ష విధానాన్ని, వర్సిటీ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి బోర్డు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని ఉన్నత విద్యా మండలి చైర్మెన్, యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లు, లెక్చరర్ల సంఘాలు, విద్యార్థి సంఘాలు, పీహెచ్డీ విద్యార్థులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్టుటైమ్ ఉద్యోగ సంఘాలు, యూజీసీకి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరారు. పీహెచ్డీ విద్యార్థుల స్వేచ్ఛను హరించేలా రీసెర్చ్ అంశాన్ని యూజీసీనే నిర్ణయించే అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్ల ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీహెచ్డీ చేస్తున్న ప్రతీ స్టూడెంట్‌కు రూ.25వేలు స్పెషల్ ఫెలోషిప్ కింద ఇవ్వాలని కోరారు. యూజీ విద్యార్థులకు, రూ.3వేలు, పీజీ విద్యార్థులకు రూ.5వేలు స్కాలర్షిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల పరిరక్షణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, అందులో విద్యార్థులకు, ప్రొఫెసర్లకు, మేధావులకు స్థానం కల్పించాలని కోరారు. పీహెచ్డీ విద్యార్థులు జాతీయ ఫెలోషిప్‌లు పొందాలంటే తప్పనిసరిగా నెట్ ఉత్తీర్ణత సాధించాలన్న యూజీసీ నిబంధనను తొలగించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పార్ట్‌టైమ్ లెక్చరర్లు పనిచేస్తున్న వారికి రెగ్యులర్ ఉద్యోగాల భర్తీలో ప్రత్యేక వెయిటేజీ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని ఉన్నత విద్యా పరిధిలోగల ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దక్షిణ భారతదేశంలోని సహజ వనరులను దోచుకునే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాని ఖండిస్తున్నామనానరు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.ఎన్.శంకర్, ద్రవిడ బహుజన సమితి రాష్ట్ర అధ్యక్షులు డా. జీలకర్ర శ్రీనివాస్, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పల్లెర్ల సుధాకర్, ఎంఎస్‌వో హబీబ్ఖాద్రి, వీఎస్ గాంధీ నాయక్, మచ్చా దేవేందర్, ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసీ చైర్మెన్ మాందాల భాస్కర్, ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ, రవీందర్ నాయక్ (ఎల్‌హెచ్‌పీఎస్), అశోక్ యాదవ్ (ఎఫ్ఎస్జే), టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హరీశ్‌గౌడ్, పీహెచ్డీ స్టూడెంట్స్ పాల్గొన్నారు. స్లగ్ : రౌండ్‌టేబుల్ సమావేశం