Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానిక సమస్యలను మీడియా వెలికి తీయాలి
- సమాఖ్య చైర్మెన్ రాపోలు రాములు
నవతెలంగాణ-బోడుప్పల్
అధునాతన సాంకేతిక రంగం బాగా అభివద్ధి చెందిన ఈ కాలంలో మీడియా పాత్ర చాలా కీలకంగా మారిందని సమాజ నిర్మాణాంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య (బీఎంసీడబ్యూఎఎఫ్) చైర్మెన్ రాపోలు రాములు అన్నారు. మంగళవారం నాడు సమాఖ్య కార్యాల యంలో సమాఖ్య అధ్వర్యంలో సమాజంలో మీడియా పాత్ర అనే అంశంపై జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడుతూ నాటి భారత స్వాతంత్య్ర పోరాటం నుండి నేటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం వరకు అనేక సందర్భాలలో మీడియా పాత్ర చాలా కీలకంగా ఉందని అన్నారు. నేడు కరోనా వైరస్ విజం భించిన సమయంలో కూడా ప్రజలను చైతన్య వంతం చేయడంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులను నిర్వహించారని అన్నారు. అదే విధంగా నేడు స్థానికంగా ఉన్న అనేక సమస్యలపై మీడియా దష్టి సారించాలని కోరారు. అనంతరం స్థానిక మీడియా ప్రతినిధులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక మీడియా ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు సంకూరి మురళి, కల్కూరి ఎల్లయ్య, సలహాదారు వీఎస్ఎన్ రెడ్డి, ఉపాధ్యక్షులు అర్.శ్రీనివాస్, డీ.నర్సయ్య, సంయుక్త కార్యదర్శి ఎన్.రాము యాదవ్, జీ.కె.స్వామి, కో-ఆర్డీనేటర్ పీ.శ్రీనివాస్, సభ్యులు వి.సుందర్, సీనియర్ జర్నలిస్టులు జె.శ్రీనివాస్ గౌడ్, కె.చంద్రమౌళి, సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ చెంచల నర్సింగ్‌రావు, సలహాదారులు చిత్తరంజన్, శ్రీనివాస్ రెడ్డి, నాయకులు జీ.యాదగిరి, చంద్రశేఖర్, రాపోలు ఉపేందర్‌లు పాల్గొన్నారు.