Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ, ఎస్టీలకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి
- ఎమ్మెల్సీ సురభి వాణీదేవి
- జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ చట్టాలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడటంతో పాటు ఎస్సీ, ఎస్టీలకు సత్వర న్యా యం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవా లని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యు రాలు, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఛైర్ పర్సన్, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సురభి వాణిదేవి హాజరై మాట్లా డారు. ప్రభుత్వం చేపట్టే పౌరహక్కుల రక్షణ చట్టం (ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్) పీసీఆర్), అత్యాచార నివారణ చట్టం (ప్రివెన్షన్ ఆఫ్ అట్రా సిటీ పీవోఏ) చట్టాలను ఖచ్చితంగా అమయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా అధికా రులకు సూచించారు. ఈ విషయంలో జిల్లాలోని అధికారులతోపాటు జిల్లా విజిలెన్స్, మానిట రింగ్ కమిటీలో సభ్యులైన పోలీసులు, రెవెన్యూ, జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి ఈ చట్టాల పై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగేలా చూడాల న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న కార్యక్రమాలపై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రివె న్షన్ ఆఫ్ అట్రాసిటీ (పీసీఆర్) చట్టం పట్ల ఎస్సీ, ఎస్టీ మహిళలు, యువకులకు సమావేశాలు నిర్వహించి తెలియజేయాలనీ, వారికి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఈ చట్టాన్ని ఉపయోగించి చర్యలు తీసుకోవడంతోపాటు వెంటనే న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూపొందించిన చట్టాలు వారికి న్యాయం చేసిన ప్పుడే వాటిపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను అట్రా సిటీ కేసులు లేని జిల్లాగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిట రింగ్ కమిటీ చైర్పర్సన్, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ అత్యాచార నివార ణ చట్టంతో పాటు పౌరహక్కుల రక్షణ చట్టంపై జిల్లా వ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు తెలియచేసి చట్టాలపై నమ్మకం కలిగేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో ప్రచారాలు చేయడంతోపాటు చట్టం గురించి, చట్టం వల్ల న్యాయం జరుగుతుందనే నమ్మకం కల్గించాల్సిన బాధ్యత అందరిపై ఉంద న్నారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్‌కు సంబం ధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సభ్యులకు సూచిం చారు. ఈ సమావేశంలో సంచారజాతుల కమిష నర్ తుర్క నరసింహం, జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్డీఓ, మల్లయ్య, జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అభివృద్ధి అధికారి వినోద్, పోలీసు ఉన్నతాధికారులు రక్షితా కృష్ణమూర్తి, మానిట రింగ్ కమిటీ సభ్యులు, జిల్లా ఎస్సీ, ఎస్టీ కమిటీ మెంబర్లు వెంకటేష్, ధన్పల్ నాయక్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.