Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పార్థసారథి
నవతెలంగాణ-ఎల్బీనగర్
హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పార్థసారథి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ(ఎం) హమాలిశాఖ మహాసభ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో శాఖ కార్యదర్శి డి. శీను అధ్యక్షతన జరిగింది. పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హమాలీలకు లైసె న్స్ కార్డులు ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పిం చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మి కులకు సంక్షేమ బోర్డు ఉన్నట్లే, హమాలీ కార్మికులకు ఏర్పాటు చేయాలన్నారు. కార్మికులు ప్రమాదాలకు గురైతే సంక్షేమ బోర్డు నుంచి వచ్చే నిధులు వారి కుటుంబాలకు ఆసరా అవుతాయన్నారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం హమాలి కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, సమావేశం జరిపి రూల్స్ రూపొందించాలన్నారు. సీపీఐ (ఎం) రంగారెడ్డి జిల్లా కోర్ కమిటీ సభ్యుడు చంద్రమోహన్ మాట్లాడుతూ.. హమాలీ కార్మికులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మార్కెట్ లోపల ఆటో ట్రాలీ స్టాండ్ ఏర్పాటుచేసి గుర్తింపు కార్డులు ఇవ్వా లన్నారు. మార్కెట్ లైసెన్స్ యూనియన్ సభ్యత్వం తీసు కున్న వాహనాలు మాత్రమే లోడు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తరలింపునకు సంబంధించి పూర్తిగా కోహెడలో నిర్మాణం చేపట్టిన తర్వాతనే తరలించాలన్నారు. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ హమాలి శాఖ కార్యదర్శిగా మల్లె పాక వీరయ్యను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కేసరి నర్సిరెడ్డి, సరూర్ నగర్ సర్కిల్ కన్వీనర్ వెంకన్న, నాయకులు మధుసూదన్, అజిత్, షరీఫ్, పోచయ్య, శ్రీను, దూలఅప్ప, శివ శంకర్‌గౌడ్, చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు.