Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్
నవతెలంగాణ-నారాయణగూడ
బీటెక్ విద్యార్థిని లావణ్య ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్ చేశారు. మంగళవారం హిమాయత్‌నగర్‌లోని కార్యాల యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన లావణ్య హైదరాబాద్‌లో బీటెక్ సెకండియర్ చదువుకుంటుందనీ, కళాశాల ఫీజు కట్టలేని దీనస్థితిలో విద్యార్థిని బలవంతపు మరణం ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత బాధాకరమన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పేద విద్యార్ధుల విద్యకు కళాశాల ఫీజులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేకపోవడం వల్ల మధ్య లోనే చదువు మానేస్తున్నారన్నారు. కళాశాల యాజ మాన్యం ఒత్తిడి తట్టుకోలేక, తల్లిదండ్రులను ఫీజు అడగలేక మనోవేదనకు గురై చనిపోవడం విచారకర మన్నారు. కళాశాల యాజమాన్యాలు సైతం తీవ్రమైన వేధింపులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఉన్నత విద్య చదువుకున్న తెలంగాణాలోని యూనివర్శిటీ విద్యా ర్ధులు ఉద్యోగం, ఉపాధి లేక వందలాది మంది యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ, ఉద్యోగ నోటిఫికేషన్లు రాక కళాశాల ఫీజులు చెల్లించలేక విద్యార్థులు తనువు చాలించడం అత్యంత బాధాకరమన్నారు. బంగారు తెలం గాణ అంటూ కబుర్లు చెబుతూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి టీఆర్ఎస్ సర్కార్ కల్పిస్తుందని విమర్శించారు. కేజీ టూ పీజీ బూటకపు హామీ అన్నారు. ప్రభుత్వం లావణ్య కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనీ, వేధింపు లకు పాల్పడిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూరి రాజు, మహిళా విభాగం నగర ప్రధాన కార్యదర్శి మబ్బు వరలక్ష్మి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మద్దెల ప్రవీణ్ కుమార్, డీబీఎస్ఎఫ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఇటికాల గణేష్, తదితరులు పాల్గొన్నారు.