Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబు
నవతెలంగాణ-వైరా టౌన్
వైరా నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కేవలం శిలాఫలకంకు పరిమితమైందని సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు. సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 17 సంవత్సరాల క్రితం 2004లో నాటి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వైరా వైద్య శాల అభివృద్ధి కోసం శంకుస్థాపన చేసిన శిలాఫలకంను మంగళవారం సిపిఐ(ఎం) బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైరా వైద్యశాల అభివృద్ధి కోసం ఆఫ్ గ్రేడ్ చేస్తూ శంకుస్థాపన చేసి పుష్కారకాలం గడిచినా ఎలాంటి పురోగతి లేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రిగా ఆఫ్ గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కరోనా సష్టించిన విపత్కర పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం వైద్యంకు పెద్ద పీట వేస్తుందని ప్రకటిస్తూ ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, మధిర ప్రభుత్వ వైద్యశాలలను వంద పడకల ఆసుపత్రులుగా ఆఫ్ గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకొని వైరా ప్రభుత్వ వైద్యశాలను మాత్రం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. వైరా నియోజకవర్గ పరిధిలో గిరిజన, దళితులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారని, ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని, వైరాలో వంద పడకల ఆసుపత్రి నిర్మించే వరకు ఉద్యమం కొనసాగుతుందని, ప్రజలు వైద్యం కోసం జరిగే ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, మండల కార్యదర్శి తోట నాగేశ్వరావు, పట్టణ కమిటీ సభ్యులు మల్లెంపాటి ప్రసాదరావు, గుడిమెట్ల రజిత, అనుమోలు రామారావు, గుడిమెట్ల మెహన్ రావు, నూకల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు