Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
ఓల్డ్ బోయిన్పల్లి ఎన్ఐఎంహెచ్ రహదారిలో చెత్త సమస్య ఇబ్బందులు కలిగిస్తున్నా, ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓల్డ్ బోయిన్పల్లి, బీజేవైఎం సీనియర్ నాయకుడు కన్నెప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆ ప్రాంతంలో ఆయన పర్యటిం చారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఇటు ఓల్డ్ బోయిన్పల్లి, అటు కంటోన్మెంట్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రజాప్రతినిధులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, మున్సిపల్ అధికారులు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు గానీ ఏ మాత్రం పట్టించుకోవడంలేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో వందల కొద్ది పందుల బెడద, మరోవైపు కొద్దిపాటి వర్షం పడితే చాలు ఆ ప్రాంతమంతా వర్షం పడి నెలల తరబడి దుర్గందభరితమై ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుందని చెప్పారు. ప్రజలు దుర్వాసన వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కంటోన్మెంట్ సీఈవో అజిత్ రెడ్డికి విన్నవించారు. స్థానిక మాజీ బోర్డ్ మెంబర్ పాండు యాదవ్, పాత బోయిన్పల్లి స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న దష్టికి తెచ్చినా ఫలితం లేకుండాపోతుందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల ముందుకొచ్చి ఏ సమస్య ఉన్నా మా దష్టికి తెలియపరచాలన్న నాయకులు ఇప్పుడు ఏ మాత్రం పట్టించుకోవడంలేదని, ఆ ప్రాంతం వైపు కూడా చూసిన పాపాన పోలేదన్నారు. పైగా వర్షాకాలం కావడం వల్ల పందుల వల్ల చాలా ఇబ్బందికరంగా మారుతుందని, అలాగే రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని, ప్రజల సమస్యలపై కానీ అధికారులు స్పందించకపోతే అటు కూకట్పల్లి మున్సిపాలిటీ కార్యాలయాన్ని, కంటోన్మెంట్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు