Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
రాష్ట్రంలో కురుమ, గొల్లలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తూ రూ.6 వేల కోట్ల నిధులను మంజూరు చేయడం హర్షించదగిన విషయమని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం ముస్లింగ్ జంగ్ఫుల్ వంతెన వద్ద ఉన్న రాష్ట్ర కురుమ సంఘం భవనంలో సీఎం.కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని గొల్ల, కురుమలకు మొదటి దఫా 5వేల కోట్లు, రెండో దఫా 6వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకోలేదన్నారు. కోకాపేటలో కురుమలు, యాదవులకు నిర్మిస్తున్న భవనాల పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, రానున్న ఆరు నెలల్లో ప్రారంభానికి సిద్ధం కాబోతున్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, కేంద్యాల శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు ఎక్కాల కన్నా, కొలుపుల నర్సింహ, కోశాధికారి కట్ట మల్లేశం, కె.శ్రీనివాస్, కురుమ యూత్ రాష్ట్ర అధ్యక్షులు తుంకుంట అరుణ్ కుమార్, నగర ప్రధాన కార్యదర్శి నర్సా వినోద్ కుమార్, రెవెళ్లే ప్రకాష్, రాచురి మల్లేశం, కాలే అమర్నాధ్, కె.విమల్ కుమార్, కె.వివేకానంద్ తదితరులు పాల్గొన్నారు.