Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జగద్గిరిగుట్ట కార్పొరేటర్ కొలుకుల జగన్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పేదల ఆకలి తీర్చేందుకే ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్లను ఏర్పాటు చేసిందని జగద్గిరిగుట్ట కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని మగ్దూంనగర్లోని కార్పొరేటర్ క్యాంపు కార్యాలయం అవరణలో అన్నపూర్ణ ఆహారపు బాక్సులను పేద ప్రజలకు పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటిన్ల ద్వారా ఆహారాన్ని అందించడం పట్ల ఎంతో మంది పేదలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రతి రోజు సుమారు 250 ఆహారపు బాక్సులను ద్విచక్ర వాహనం ద్వారా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ నాయకులు కొలుకుల జైహింద్, నాయకులు హనుమంత్చారి, బాలు, అప్పల శ్రీను, భూపాల్, సంపత్‌రెడ్డి, శ్రీనివాస్‌చారి, రాజశేఖర్, దుర్గేష్, చిన్న తదితరులు పాల్గొన్నారు.