Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ (ఎన్ఐఎఫ్డీ) ఆధ్వర్యంలో నూతన విద్యా సంవత్సరానికి డిప్లొమా, బీఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీలో అడ్మిషన్లు ప్రారంభించినట్లు ఆ సంస్థ అకాడమీ డైరెక్టర్ రాము యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో వృత్తి విద్యా కోర్సులు చేసిన వారికి ప్రభుత్వ, ప్రయివేట్ రంగాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. అదేవిధంగా మహిళల ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణించాలనుకునే వారికి ఫ్యాషన్ మీద మక్కువతో పాటు దృఢ సంకల్పం ఉండాలని సూచించారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ, టెక్స్టైల్ ఇండిస్టీతోపాటు హైదరాబాద్, చిన్న పట్టణాల్లో డిజైనింగ్ బొటిక్ రోజు రోజుకు మంచి ఆదరణ లభిస్తుందని, వీటి ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పొందవచ్చునని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఫోన్ నంబర్ 9030610033, 9030610055 సంప్రదించాలని ఆయన సూచించారు.