Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
నవతెలంగాణ-అడిక్‌మెట్
విధుల నుంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం విద్యానగర్ బీసీ భవన్లో ఫీల్డ్ అసిస్టెంట్లకు మద్దతుగా ఆర్. కృష్ణయ్య నిర్వహిస్తున్న ధర్మదీక్షకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒక కలంపోటులో అన్యాయంగా 7651 మందిని తొలగించిన ఘటన దేశంలో ఎప్పుడు జరగలేదన్నారు. ఏం తప్పు చేశారని వీరిని తొలగించారని ప్రశించారు. వీరిని తొలగించడం రాజ్యాంగం విరుద్ధం, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. పైగా వీరి జీతాలకు 90 శాతం బడ్జెటు కేంద్రం ప్రభుత్వమే ఇస్తుందని, అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలా తొలగిస్తుందని ప్రశ్నించారు. 15 రోజుల్లో తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగంలోకి తీసుకోకపోతే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పోటీ చేస్తారన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అఖిలపక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మెన్ శ్యామలయ్య, కో చైర్మెన్ కపాకర్ తెలిపారు. బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, ఏ.లక్ష్మణ్ యాదవ్, పగిడాల సుధాకర్, వేముల రామకష్ణ, చంటి ముదిరాజ్, పగిల్ల సతీష్, బ్రహ్మయ్య, జి.అనంతయ్య, చరణ్ యాదవ్, బైరు మణికంఠ, నిఖిల్, రాజ్ కుమార్, రవికుమార్, సంజరు, శంకర్, మనోజ్‌తో సహా వందలాది మంది దీక్షలో పాల్గొన్నారు.