Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్
నవతెలంగాణ-నారాయణగూడ
దళిత మహిళ మరియమ్మ కేసులోని నిందితులైన పోలీసులను సర్వీసు నుంచి తొలగిస్తే సరిపోదని, హంతకులను ఐపీసీ 302 సెక్షన్, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్ డిమాండ్ చేశారు. బుధవారం హిమాయత్‌నగర్‌లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో దళిత మహిళ మరియమ్మను చిత్ర హింసలకు గురిచేసి లాకప్ డెత్‌కు పాల్పడిన పోలీసులను, నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో కొమ్మ గ్రామానికి చెందిన దళిత బాలిక చింతమల్ల ప్రియాపై లైంగికదాడి, హత్య చేసిన పవన్ తదితరులపై హత్యానేరం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. హత్యాకాండలకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, లేకపోతే ఆగస్టు15న బ్లాక్ డేగా పాటించి, రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపడుతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వేదవృత్, ప్రధాన కార్యదర్శి చేపూరి రాజు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మద్దెల ప్రవీణ్ కుమార్, కార్యదర్శి మబ్బు వరలక్ష్మి, డీబీఎస్ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇటికాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.