Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత అనుభవాలతో ముందస్తు జాగ్రత్తలు
- చెరువులు, వంతెనలు, వాగుల వద్ద ప్రత్యేక నిఘా
- అవర్షాకాలం నేపథ్యంలో సమగ్ర ప్రణాళిక రూపకల్పన
- అవాతావరణ హెచ్చరికలతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రయాణికుల భద్రతకు దక్షిణ మధ్య రైల్వే అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలపై దృష్టి సారించారు. ముందు చర్యలో భాగంగా పలు ప్రాంతాలల్లో (వంతెనలతో సహా) అవసరమైన చర్యలు చేపట్టారు. రైళ్ల నిర్వహణతోపాటు కావాల్సిన మౌలిక సదుపాయాలపై అన్ని డివిజన్లలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రణాళికను రూపొందించారు. ఎలాంటి ప్రమాధాలను, విపత్తులను ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బందిని అలర్ట్ చేశారు.
ట్రాక్‌ల పెట్రోలింగ్, వంతెనల వద్ద కాపలాదారు ఏర్పాటు
గుర్తించిన బ్లాక్ సెక్షన్లలో వర్షాకాలంలో పెట్రోలింగ్‌తోపాటు చెరువులు, గుంటలు, వంతెనల వద్ద పరిస్థితుల అంచనాకు తగిన విధంగా కాపలాదారు ఏర్పాటు చేస్తారు. ఏదేని సెక్షన్లో అసాధారణ వర్షపాతం లేదా తుఫాను నమోదయిన సందర్భంలో వాతావరణం తిరిగి సాధారణ స్థితికి చేరుకునేంత వరకూ పెట్రోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.
వంతెనలపై రైల్వే ట్రాక్‌లపై ప్రత్యేక దృష్టి
జోన్ పరిధిలోని రైల్వే మార్గాన్ని ప్రభావితం చేసే సుమారు 1900 చెరువులు, గుంటలను అధికారులు గుర్తించారు. చెరువుల పరిస్థితి, మరమ్మతులపై రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో రైల్వే అధికారులు రాష్ట్ర స్థాయి సమావేశాలను నిర్వహించారు. చెరువులు, గుంటల తాజా స్థితిపై సమీక్షించారు. డ్యాములు, రిజర్వాయర్ల పరిధిలో ఉన్న రైల్వే వంతెనలను సూక్ష్మంగా పరిశీలించేంలా చర్యలు తీసుకున్నారు. మిగులు జలాలను విడుదల చేసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా ముందస్తు చర్యలు చేపట్టారు. అనుకోని విధంగా వరదలు వచ్చినా నివారించేందుకు అన్ని ముందస్తు జాగ్రత్తకలు తీసుకున్నారు. డివిజన్లలో గుర్తించిన ప్రాంతాలలో పునరుద్ధరణకు అవసరమయ్యే సామగ్రిని అందుబాటులో ఉంచారు.
30 ఎనిమోమీటర్ల ఏర్పాటు
సంబంధిత వాతావరణ శాఖ నుండి వచ్చే వాతావరణ హెచ్చరికలు/తుఫాను సమాచారాన్ని సంబంధిత క్షేత్రస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ తగిన చర్యలు చేపట్టడం. దాంతోపాటు గుర్తించిన వంతెనల సమీపంలోని స్టేషన్ల భవనాలపై 30 ఎనిమోమీటర్లను ఏర్పాటు చేశారు. గాలి వేగాన్ని ఎప్పటికప్పుడూ అంచనా వేస్తూ రైళ్ల రవాణా క్రమబద్దీకరణకు తగిన చర్యలు తీసుకునే అవకాశాలుంటాయి. అంతేకాకుండా నీటి స్థాయి పర్యవేక్షణ కోసం గుర్తించిన వంతెనలపై 12 ఆటోమేటెడ్ నీటిస్థాయి పర్యవేక్షణ పరికరాలను ఏర్పాటు చేశారు.
క్షేత్రస్థాయిలో అప్రమత్తం: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్
రైల్వే ప్రయాణికుల భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య బుధవారం తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వర్షాకాలంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి క్షేత్రస్తాయిలో సిబ్బందిని అలర్ట్ చేశామన్నారు. అన్ని జోన్ల జోన్ల్ అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేశామన్నారు. 'భద్రతా చర్యలలో ఎటువంటి రాజీ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆరు డివిజన్ల అధికారులను ఆదేశించారు. ఒక వేళ రైళ్లను క్రబమబద్ధీకరిస్తే లేదా రైళ్ల సర్వీసులకు ఆటంకాలు ఏర్పడితే ప్రయాణికుల రైళ్ల రవాణాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఆ సమాచారాన్ని వీలైనంత త్వరగా ప్రజలకు అందించాలని ఆయన అన్నారు.