Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రగతి పథంలో గౌరెల్లి
- ఇంటింటకీి మంచినీరు, మౌలిక వసతులు
- ప్రజా భద్రతకు నిఘానేత్రాలు
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
మనిషి సంఘజీవి కనుక ఇతరులతో కలసి సమూహంగా జీవించుటకు ఒక చోట, లేక ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని నివాసాలు ఏర్పాటుచేసుకోగా ఏర్పడినదే గ్రామం లేక పల్లె. గ్రామాల మధ్య వ్యాపార సంబంధ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఒక కూడలిగా పట్టణాలు ఏర్పాటు అయ్యాయి. పట్టణాల అనుసంధానంగా గ్రామాలు అభివద్ధి చెందు తుంటాయి.
నగర శివారుకు సమీపంలో ఉన్న గ్రామాలు ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా ఉండడంతో అభివద్ధి శరవేగంగా పుంజుకుంటుంది. మూసీ పరివాహక ప్రాంతం అయిన అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, గౌరెల్లి గ్రామం మౌలిక సదుపాయాల కల్పనలో అభివద్ధి సాధిస్తోంది. గ్రామంలో సుమారుగా 3,260 మంది జనాభా ఉండగా, అందులో రెండు వేలకుపైగా ఓటర్లు ఉన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ తుడుం మల్లేష్ నేతత్వంలో మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా అభివద్ధిలో ముందుకు సాగుతోంది. ప్రభుత్వం అందిస్తున్న నిధులతో గ్రామం సాధికారత సాధి స్తోందని సర్పంచ్ తుడుం మల్లేష్ అంటున్నారు. ఇప్పటికే రూ.25లక్షలు జిల్లాపరిషత్, రూ.35 లక్షల మండల పరిషత్ నిధులతో సీసీ రోడ్లు, రూ.7లక్షల నిధులతో యూజీడి పైపులైన్, రూ.5లక్షల నిధులతో బీసీ కమ్యూనిటీ హల్ భవనం, రూ.65 లక్షల నిధులతో బీటీ రోడ్డు నిర్మాణం, ప్రతి నెల రెండున్నర లక్షలు 14వ ఫైనాన్స్ నిధులతో గ్రామం అభివద్ధి పథంలో ముందుకు సాగుతోంది. మూడున్నర లక్షలతో కష్ణ వాటర్ పైపులైన్‌తో మిషన్ భగీరథ ద్వారా సుమారుగా 7,25 కుటుంబాలకు నల్లా కలెక్షన్స్‌తో తాగునీరు అందిస్తున్నారు. రూ.12.6లక్షల నిధులతో శ్మశానవాటిక అభివద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే ప్రజలకు విద్యుత్ సౌలభ్యం కోసం నాలుగు ట్రాన్స్ఫార్మర్స్తోపాటు 106 విద్యుత్ స్తంభాలు గ్రామ పరిధిలో ఏర్పాటు చేశారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతిలో గుర్తించిన మౌలిక సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు వేసిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గ్రామస్తుల సమిష్టి సహకారంతో గౌరెల్లి గ్రామం అభివద్ధి పథంలో మరింత ముందుకు వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.