Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎల్బీనగర్ జోన్ పరిధిలోని 13వ డివిజన్లలోని అనేక కాలనీలు వరద నీటిలో మునిగిపోయి. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారనీ, ప్రజలను కాపాడాలని రంగా రెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి కోరారు. గురువారం జీహెచ్ఎంసి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డికి కార్పొరేటర్లతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ముంపునకు గురై చెరువులను తలపిస్తున్న కాలనీలకు వర్షాలు తగ్గుముఖం పట్టక పోగా భారీ వర్షాలు కురుస్తుండడంతో పెను ప్రమాదం పొంచి ఉంది అన్నారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థి తుల్లో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమై ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల చినుకు పడిందంటే కంటి మీద కునుకులేకుండా వణికి పోవాల్సిన దుస్థితి నెలకొంది అన్నారు. గత ఏడాది వరదల సమయంలో భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా శాశ్వత చర్యలు చేపడతామని మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే చెప్పిన మాటలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయాయు. వారి హామీ ఏ ఒక్కటి కూడా ఆచరణకు నోచుకోలే దనడానికి ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బం దులే ప్రత్యక్ష నిదర్శనమని ఆయన తెలిపారు.
కావున ఇప్పటికైనా ఎల్బీనగర్ జోన్ అధికార యంత్రాంగం వరద ముంపు సమస్యల పరిష్కారానికి అందరితో సమన్వయంతో పని చేయాల న్నారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు వంగా మధు సుధన్ రెడ్డి, రాజ శేఖర్ రెడ్డి, రంగా నర్సింహా గుప్తా, చింతల అరుణ సురేందర్ యాదవ్, కొప్పుల నర్సింహా రెడ్డి, లచ్చి రెడ్డి పాల్గొన్నారు.