Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నూతన ఆవిష్కరణల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికితీసే ఇంటింటా ఇన్నో వెటర్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలలోని సృజనాత్మకతను ప్రోత్సహించడానికి మూడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆవిష్కరణల ప్రదర్శనకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. ఈ సంవత్సరం కూడా కొవిడ్ కారణంగా దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తున్నామని తెలిపారు. ఆవిష్కర్తలు తమ దరఖాస్తులను ఈ నెల 25వ తేదీలోపు వాట్సాప్ నెంబర్ 9100678543 కు పంపించాలని తెలిపారు. జిల్లా ప్రజలు, విద్యార్థులు, విద్యావంతులు, గృహిణిలు, వివిధ వృత్తుల వారు, ఎవరైనా ఇందుకు అర్హులేనని, వారి ఆవిష్కరణలకు సంబంధించి ఆరు వాక్యాలు, రెండు నిమిషాల వీడియోను, ఆవిష్కరణకు చెందిన నాలుగు ఫోటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్ నెంబర్, వయసు, ప్రస్తుత వృత్తి, గ్రామం పేరు, జిల్లా పేరు, తదితర వివరాలను పైన తెలిపిన నెంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపాలని సూచించారు. అందిన దరఖాస్తుల నుంచి 5 ఆవిష్కరణలను ఎంపిక చేసి ఆగస్టు 15వ తేదీన ప్రదర్శించడం జరుగుతుందన్నారు. జిల్లా ప్రజలు విద్యావంతులు, విద్యార్థులు, కొత్తగా ఆలోచించే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు, సందేహాలకు జిల్లా సైన్స్ ఆఫీసర్ కే. శ్రీనివాస్‌రెడ్డిని 9440507584 నెంబర్లో సంప్రదించాలన్నారు.న