Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ టీమ్‌లు అలర్టుగా ఉన్నరు
- ప్రాబ్లం ఉంటే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయండి
- నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
- సోమాజిగూడ డివిజన్లో వరదనీరు నిలిచిన ప్రాంతాలు, నాలాల పరిశీలన
నవతెలంగాణ-సిటీబ్యూరో/ బంజారాహిల్స్
గ్రేటర్ పరిధిలో వర్షంవల్ల ఇబ్బందులు తలెత్తితే ఎదుర్కొంటామని, అందుకోసం ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ టీమ్‌లు అలర్టుగా ఉన్నాయని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజరులక్ష్మి అన్నారు. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. సిటీలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పౌరులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు, డిజాస్టర్ రెస్క్యూ టీమ్‌లను నియమించి పరిస్థితులను సమీక్షస్తున్నట్టు తెలిపారు. గురువారం సోమాజిగూడ డివిజన్లో వరదనీరు నిండిన పలు ప్రాంతాలను, నాలాల పరిస్థితులను స్థానిక కార్పొరేటర్ సంగీత, ఎస్ఈ రత్నాకర్, ఈఈ ఇందిరాబాయితో కలిసి మేయర్ పరిశీలించారు. వాతావరణ శాఖ జారీచేసిన సమాచారం ప్రకారం సిటీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరద పరిస్థితిని ఎదుర్కునేందుకు అధికారులు తమ పరిధిలోని క్షేత్రస్థాయి మాన్సూన్ ఎమర్జెన్సీ బందాలను అప్రమత్తంచేసి, అందుబాటులో ఉంచాలని జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు సూచించామని చెప్పారు. సిటీలోని చెరువుల్లో నీటి మొత్తాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు. కొన్ని ప్రాంతాల్లో నీటిని తోడి వేయడానికి మోటార్లను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఎంఎస్ మక్తా, పార్క్హౌటల్ సమీపంలోని నాలాను పరిశీలించి, మోటర్లతో నీళ్లు నిలిచిన ప్రదేశాలను క్లియర్ చేయాలని ఆదేశించారు. ఎమ్మెస్ మక్తాలో ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని మేయర్ ఆదేశించారు. పార్క్ హౌటల్ నాలావద్ద జరుగుతున్న పనులను పరిశీలించి తర్వగా పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షంవల్ల సమస్యలు తలెత్తే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నెంబర్ 040-21111111 కు ఫోన్ చేయాలని సూచించారు.