Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్కాజిగిరి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, అడ్వకేట్ బండి శ్యామ్‌గౌడ్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
అక్రమ అరెస్టులతో ప్రజా పోరాటాలను ఆపలేరని, ప్రజా వ్యతిరేక విధానాలతో పాలిస్తున్న బీజేపీకి రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని మల్కాజ్గిరి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు అడ్వకేట్ బండి శ్యామ్‌గౌడ్ అన్నారు. పెగసెస్ స్ప్రే వేర్ ద్వారా మొబైల్ ఫోన్లను హ్యాక్ చేస్తూ వ్యక్తుల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ తప్పుడు చర్యలకు నిరసిస్తూ తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు ఛలో రాజ్ భవన్ కార్యక్రమానికి తరలివెళ్తుండగా జీడిమెట్ల పోలీసులు ముందస్తు హౌజ్ అరెస్టు చేసి కాంగ్రెస్ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఏడేండ్ల పాలనలో దేశంలో మోడీ సర్కార్ నిత్యావసర సరుకులతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేద, సామాన్యుడికి నిలువ నీడ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పూర్తిగా అవినీతి మయంగా అరాచకంగా పాలిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని, 2023లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానుందని జోస్యం చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ దళ్ రాష్ట్ర అధ్యక్షులు గూడ ఐలయ్యగౌడ్, అవిజె జేమ్స్, కుత్బుల్లాపూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బంటు నరేష్, మహేష్, రమేష్‌నాయక్, యాదగిరి, సాయి ప్రవీణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.