Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
పెండింగ్‌లో ఉన్న సమస్యలను సత్వరమే పూర్తి చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం సర్కిల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా ఎటువంటి సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహించే మొక్కలు నాటే కార్యక్రమంలో అధికారులు సహాయ సహకారాలు ఉండేలా చూడాలన్నారు. నియోజకవర్గంలో పార్కులు, చెరువులు సుందరీకరణ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మమత, ఎస్ఈ శంకర్, డీసీలు రవీకుమార్, రవీందర్‌కుమార్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.